Breaking News

మాధవ్ బాధ్యతల స్వీకరణ మహోత్సవానికి భారీగా హాజరైన పశ్చిమ బీజేపీ శ్రేణులు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ బీజేపీ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన పోకల వంశీ మాధవ్ బాధ్యతల స్వీకరణ మహోత్సవానికి ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ ఆధ్వర్యంలో పశ్చిమ బీజేపీ శ్రేణులు భారీగా హాజరయ్యారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద నుంచి సూర్యారావుపేటలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారత్ మాతాకీ జై అంటూ , మాధవ్ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. మహిళలు, యువత, బీజేపీ శ్రేణులు, నాయకులు కార్యకర్తలు పండుగ వాతావరణం లో మాధవ్ కి ఘన స్వాగతం పలికారు. ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ ఆధ్వర్యంలో జరిగిన భారీ ర్యాలీలో మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ, బీజేపీ నేతలు పైలా సోమి నాయుడు, పైలా సురేష్, బెవర మురళి, రెడ్డి పల్లి రాజు, యలకల అనిల్, పోతిన భేసు కంటేశ్వరుడు, సత్యసాయి ప్రసాద్, లింగాల అనిల్, దొడ్ల రాజా, గన్నవరపు శ్రీనివాసరావు, దేవున హరిప్రసాద్, పగడాల కృష్ణ, కోలపల్లి గణేష్, అవ్వారు బుల్లబ్బాయి, వై విశ్వేశ్వరరావు, కందుల సుబ్రహ్మణ్యేశ్వరరావ్, నున్న కృష్ణ, బెన్నా బత్తుల సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు..

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *