విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో మంజూరైన ఎల్.ఓ.సి (లెటర్ ఆఫ్ క్రెడిట్) పత్రాలను బుధవారం భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, టీడీపీ కార్పొరేటర్ అర్షద్ , కూటమి నేతలతో కలిసి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. పంజా సెంటర్ కు చెందిన అబ్దుల్ షఫీ (36)మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. తనకి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు తెలపటంతో కార్పొరేటర్ అర్షద్ ఎన్డీఏ కార్యాలయంలో వైద్యం సాయం కోసం దరఖాస్తు చేశారు. రూ 5 లక్షల 40 వేల ఎల్ ఓ.సీ పత్రాన్ని వారి కుటుంబ సభ్యులకు అందించారు. అదేవిధంగా 52 వ డివిజన్ కొత్తపేట చెందిన వై రమణమ్మ ( 69) బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం దరఖాస్తు చేసుకోగా రూ 2 లక్షల 85 వేల ఎల్.ఓ.సీ అందించారు. త్వరితగతిన ఎల్.ఓ.సీ మంజూరు చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు వేవిన నాగరాజు, మధు మస్తాన్, అట్లూరి బెనర్జీ,సుజనా మిత్రా కోఆర్డినేటర్లు సప్పా శ్రీనివాస్, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News