Breaking News

APPSC – వివిధ లెక్చరర్ పోస్టుల సంబంధించిన పరీక్షలు, జూలై – 2025 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

-ఈ నెల 15 వ తేదీ నుండి 23 వ తేదీ వరకు (19 వ తేదీ మినాహా) నిర్వహించనున్న APPSC – వివిధ లెక్చరర్ పోస్టుల సంబంధించిన పరీక్షలు, జూలై – 2025 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
-తిరుపతి జిల్లాలో 6 పరీక్ష కేంద్రాలలో హాజరుకానున్న 6412 అభ్యర్థులు
-జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 15.07.2025 నుండి 23.07.2025 వ తేదీ వరకు (19.07.2025 మినాహా) జిల్లాలో జరగనున్న APPSC – వివిధ లెక్చరర్ పోస్టుల సంబంధించిన పరీక్షలు, జూలై – 2025 పరీక్షలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు సంబంధిత అధికారులతో రేపు జరగనున్న APPSC పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.

జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ ఈ నెల 15 వ తేదీ నుండి 23 వ తేదీ వరకు (19.07.2025 మినాహా) APPSC ద్వారా నిర్వహించనున్న వివిధ లెక్చరర్ పోస్టుల సంబంధించిన పరీక్షలు ఉ. 9.30 నుండి మ 12.00 మరియు మ.2.30 నుండి మ.5.00 ( 2 Sessions) వరకు 6 సెంటర్ల నందు పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తి అయ్యాయని పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు.

తిరుపతి జిల్లాలో ఈ పరీక్షలకు మొత్తం 6 సెంటర్ల ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ పరీక్షల కొరకు 6412 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఈ పరీక్షల కొరకు ఆరుగురు డిప్యూటీ తహశీల్దార్లను లైజన్ అధికారులు గా నియమింపడం జరిగందని తెలిపారు.

పరీక్షా కేంద్రాలలోకి మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రానిక్ వాచ్ లు, వైర్లెస్ హెడ్ సెట్స్, తదితర ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతి ఉండదని , పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు, ఆర్టీసి బస్సు సౌకర్యం, మెడికల్ క్యాంపులు, విద్యుత్ అంతరాయం లేకుండా సంబందిత శాఖల అధికారులు చూడాలని, త్రాగు నీరు, టాయిలెట్స్ సక్రమంగా ఉండాలని, అభ్యర్థుల సౌకర్యార్దం సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా ఆర్ టి సి వారు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.

APPSC – వివిధ లెక్చరర్ పోస్టుల సంబంధించిన పరీక్షలు, జూలై – 2025 పరీక్షా కేంద్రముల వివరాలు:

1. 2334- సిద్ధార్థ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ, సిద్ధార్థ్ నగర్, నారాయణవనం రోడ్, పుత్తూరు, తిరుపతి, 517583.

2. 1244- చదలవాడ రమణమ్మ ఇంజినీరింగ్ కళాశాల, చదలవాడ నగర్, రేణిగుంట రోడ్, తిరుపతి- 517506.

3. 9105- ION డిజిటల్ జోన్, iDZ, జూ పార్క్ రోడ్, చెర్లోపల్లి గ్రామం, తిరుపతి 517503.

4. 1854- నారాయణ ఇంజనీరింగ్ కళాశాల, గూడూరు, ధూర్జటి నగర్, గూడూరు, తిరుపతి 524101.

5. 1560- NBKR ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ, విద్యానగర్, కోట మండలం, తిరుపతి 524413.

6. 33932- NBKR సైన్స్ & ఆర్ట్స్ కళాశాల, విద్యానగర్, కోట మండలం, తిరుపతి 524413

ఈ సమావేశంలో APPSC నుండి ఎ. ఎం. మాధవి లత, సెక్షన్ ఆఫీసర్, వి. దుర్గా భవాని, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మరియు సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *