విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రిపబ్లికన్ పార్టీ అఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఉప్పులేటి దేవీ ప్రసాద్ సోమవారం జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రాంచందర్ ను విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో కలిసి ఓ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి నియోజకవర్గం ఆరవల్లి గ్రామం & గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం మరియు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం జక్కుల నెక్కాలంలో ఎస్సి లపై జరిగిన దాడులపై సమగ్ర విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని, బాధితులకు నష్ట పరిహారం చెల్లించి న్యాయం జరిగేలా చూడాలని మరియు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రాంచందర్ కి అందచేసిన వినతి పత్రంలో తెలిపినట్లు తెలియచేసారు.
Prajavartha Online Telugu News