Breaking News

ఖతార్ దేశంలోని వెల్డర్స్ ఉద్యోగ అవకాశాలు…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఖతార్ దేశంలోని వెల్డర్స్ ఉద్యోగ అవకాశాల కొరకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి, ఆర్. లోకనాథం తెలియజేశారు. వెల్డర్స్ ఉద్యోగానికి అప్లై చేసే అభ్యర్థులకు వయస్సు 24 నుంచి 45 సంవత్సరాల లోపు ఉండాలి. విద్యార్హతలు : ఐటీఐ లేదా ఐటీసీ విద్యార్హత ఉండి నాలుగు సంవత్సరాల అనుభవం ఉండాలన్నారు. టీఐజీ లేదా ఏఆర్సీ మల్టీవెల్డర్ ఉద్యోగానికి ఎంపికైనవారికి రూ.52 వేల నుంచి రూ 61,500, టీఐజీ లేదా ఏఆర్సీ వెల్డర్ ఉద్యోగానికి రూ.42,500 నుంచి రూ.52వేల వరకు వేతనాలు ఇస్తారన్నారు. కాంట్రాక్ట్ కాలం రెండేళ్లు ఉంటుందన్నారు. ఉచిత వసతి, భోజనం, వైద్య సదు పాయాలు, రవాణా సౌకర్యం, స్వదేశానికి ఒక్కసారి వచ్చి పోవ టానికి టిక్కెట్ సౌకర్యం ఉంటుందన్నారు.

ఆసక్తి గల అభ్యర్థులు పాస్పోర్టులు, అనుభవం సంబంధిత విద్యా ధృవపత్రాలతో జూలై 31 వ తేదీలోగా రిజిస్ట్రేషన్ కొరకు ఈ క్రింద వెబ్సైట్ లో నమోదు చేసుకోవలసినదిగా కోరుచున్నాము
https://naipunyam.ap.gov.in/user-registration?page=program-registration
మరిన్ని వివరములుకు ఫోన్ నంబర్లు : 95502 15161,91609 12690, 9988853335, ను సంప్రదించండి

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *