-పి జి ఆర్ ఎస్ లో వచ్చిన ఆర్జీలు పునరావృతం కాకుండా పరిష్కారం చూపాలి
-ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పి జి ఆర్ ఎస్ ) ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీలకు నాణ్యతగా గడువు లోపు పరిష్కారం చూపాలి : జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, (పి జి ఆర్ ఎస్) కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపి మానవతా దృక్పదంతో వ్యవహరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ జిల్లా అధికారులను ఆదేశించారు.
సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి జి ఆర్ ఎస్) లో జిల్లా కలెక్టరేట్ కార్యాలయమునకు మారుమూల ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులకు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించిన పిజిఆర్ఎస్ పరిష్కార వేదిక ఆవరణంలో వారు కూర్చోడానికి వీలుగా కుర్చీలు, వైద్య ఆరోగ్య శాఖ వారిచే వైద్య శిబిరం, త్రాగునీటి సౌకర్యం, సూదురా ప్రాంతాల నుండి వచ్చు వారికి టి, కాఫీ ఏర్పాటు చేసి వచ్చిన అర్జీదారులకు అందించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారియొక్క సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీవోలు తాసిల్దారులు, ఎంపిడిఓ లు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా పీజిఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ అధికారులను ఆదేశించారు.
జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్ర రెడ్డి, శివశంకర్ నాయక్,సుధా రాణి, రోజ్ మాoడ్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.
వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి, ఆన్లైన్ నమోదు చేసి అర్జీదారులకు రసీదులు అందించారు.
శాఖల వారీగా అర్జీల వివరాలు :
రెవెన్యూ -136, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్- 10, స్కూల్ ఎడ్యుకేషన్- 12, పంచాయతీ రాజ్- 21, సివిల్ సప్లైస్- 19, జాతీయ రహదారులు- 8, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ -2, రూరల్ డెవలప్మెంట్ -3, apswries -28, విద్యుత్ శాఖ -6, స్కిల్ డెవలప్మెంట్ -1, రుయా- 1, అటవీ శాఖ- 3, హౌసింగ్- 2, మెడికల్ -4, రూరల్ పావర్టీ- 4, ఆర్టీసీ- 1, ఏపీ.ఐసీసీ- 1, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ -1, ఇరిగేషన్ -5, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్- 6, సమగ్ర శిక్ష -1, ఐసిడిఎస్ -1, పోలీస్- 13, సర్వే శాఖ- 7, జి ఎస్ డబ్ల్యూ ఎస్ -2, టిటిడి- 1, ఆర్ డబ్ల్యు ఎస్- 1, జల వనరుల శాఖ -1, మొత్తం 301 అర్జీలు రావడం జరిగిందని సంబంధిత అధికారులు వచ్చిన అర్జీల పై దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖల అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.
Prajavartha Online Telugu News