విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గోవా గవర్నర్ గా నియమితులైన టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి వర్యులు పూసపాటి అశోక్ గజపతి రాజు కు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ కేంద్ర మంత్రి యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గోవా అభివృద్ధిలో అశోక్ గజపతిరాజు భాగస్వామి కావాలని అంకితభావం, కృషి ద్వారా విజయాలను సాధించాలని, లక్ష్యాలను చేరుకోవాలని సుజనా చౌదరి ఆకాంక్షించారు.
Prajavartha Online Telugu News