గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ఎన్టీఆర్ మునిసిపల్ స్టేడియంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వారం రోజుల్లో పూర్తీ చేసేలా యాక్షన్ ప్లాన్ ప్రకారం చేపట్టాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక బృందావన్ గార్డెన్స్ లోని ఎన్టీఆర్ మునిసిపల్ స్టేడియంలో అభివృద్ధి పనులను పరిశీలించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న అభివృద్ధి పనులు నాణ్యతా ప్రమణాలు పాటిస్తూ జాప్యం లేకుండా చేపట్టాలన్నారు. ట్రాక్ పనులతో పాటు వర్షం నీరు నిల్వకుండా డ్రైనేజి సిస్టం కూడా సమగ్రంగా చేపట్టాలన్నారు. సీతారామయ్య స్కూల్ వైపు కాంపౌండ్ వాల్ నిర్మాణం పరిశీలించి, నిర్మాణ సమయంలో వాటర్ క్యూరింగ్ చేయాలన్నారు. వాకింగ్ ట్రాక్ లోకి వాహనాలు రాకుండా మెయిన్ గేట్ల దగ్గర చిన్న గేట్లు ఏర్పాటు చేయాలని డిఈఈని ఆదేశించారు. స్టేడియంకు వాకర్స్ ఎక్కువ మంది వస్తుంటారని, పనులు జాప్యం వలన వారికి సమస్య ఎదురయ్యే అవకాశం ఉన్నందున పనులను వేగంగా చేయాలని ఆదేశించారు. పర్యటనలో డిఈఈ రమేష్ బాబు, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News