గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అన్నక్యాంటీన్లలో ప్రతి రోజు నిర్దేశిత సమయంలో అహారం అందించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అక్షయ పాత్ర సిబ్బందిని ఆదేశించారు. సోమవారం ఆర్టీఓ కార్యాలయం దగ్గరలోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలోని 7 అన్న క్యాంటీన్లలో ప్రభుత్వ నిర్దేశిత సమయానికి అనుగుణంగా ఆహారం అందించాలని, వారి సంఖ్యకు అనుగుణంగా ఇండెంట్ ఉండేలా చూడాలని అక్షయ పాత్ర సిబ్బందికి తెలిపారు. క్యాంటీన్లలో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు నోడల్ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. క్యాంటీన్లలో శుభ్రమైన త్రాగునీటిని అందుబాటులో ఉంచాలన్నారు. క్యాంటీన్లలో ఆహార పదార్ధాల నాణ్యత, సూచనలను క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా తెలియచేయవచ్చని, క్యూఆర్ కోడ్ పై క్యాంటీన్ కి వచ్చే వారికి తెలియచేయాలన్నారు.
Prajavartha Online Telugu News