Breaking News

వసతి గృహాల్లో పిల్లలు వంద శాతం ఉండేలా చూడాలి

-వసతి గృహ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వంద శాతం సామర్థ్యం పెంచాలి
-జిల్లాలోని వసతి గృహాల మరమ్మత్తులకు రూ.9.30 కోట్ల నిధులు కేటాయింపు
-రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ వీరాంజనేయ స్వామి
-వసతి గృహాలలో వసతుల కల్పన పై అధికారులు బాధ్యతగా కృషి చేయాలి
-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

నంద్యాల, నేటి పత్రిక ప్రజావార్త :
వసతి గృహాల్లో వంద శాతం సామర్థ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని.. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పూర్తి స్థాయిలో పిల్లలు ఉండేలా బాధ్యతగా చిత్తశుద్ధితో కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ వీరాంజనేయ స్వామి సాంఘిక సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు

సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో కలెక్టర్ ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ, విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమ, ఈడి ఎస్సీ కార్పొరేషన్, గ్రామ, వార్డు సచివాలయాల అంశాలపై మంత్రి అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. వసతి గృహాల మరమ్మత్తులకు సంబంధించి రూ.9.30 కోట్ల నిధులను విడుదల చేయడం జరిగిందన్నారు. పనులన్నీ నాణ్యతగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఉన్న పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ వసతి గృహాల్లో కొన్నిచోట్ల వంద శాతం పైగా సీట్లు భర్తీ చేసి నందులకు జిల్లా కలెక్టర్ ను, యంత్రాంగాన్ని మంత్రి అభినందించారు. ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ పోస్ట్, ప్రీ మెట్రిక్ వసతి గృహాల్లో పిల్లలను చేర్చడం శుభపరిణామం అన్నారు. అదే విధంగా ఇంకా ఎక్కువ శాతం సీట్లు కావాలని కూడా దరఖాస్తులు వస్తున్నాయని, అందుకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. జిల్లాలో వేల్పనూరు, వెంకటాపురం, శ్రీశైలం, ఆత్మకూరు నందికొట్కూర్ డోన్ బనగానపల్లి నంద్యాల కోవెలకుంట్ల వసతి గృహాల్లో తక్కువ శాతం అడ్మిషన్స్ ఉన్నారని, స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వంద శాతం విద్యార్థులు ఉండేలా చూడాలన్నారు. అదే విధంగా ఇది వరకే ఆ పాఠశాలలో చదివి పాస్ ఔట్ అయిన విద్యార్థుల ద్వారా సదరు వసతి గృహాల్లో విద్యార్థులు చేరేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. ఎక్కడైతే పూర్తి శాతానికి మించి ఎక్కువగా పిల్లలు ఉన్నచోట నుంచి తక్కువ శాతం ఉన్న కళాశాలను ఒకే కళాశాలగా మార్చే అంశంపై కూడా పరిశీలించాలన్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి వసతి గృహ సంక్షేమ అధికారులు కట్టుబడి ఉండాలన్నారు. అదే విధంగా ఉపాధ్యాయులు కూడా స్పెషల్ క్లాసులు నిర్వహించి తక్కువ శాతం మార్కులు సాధించే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా వసతి గృహాల్లో రాత్రి వేళల్లో పోలీసు పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు జిల్లా ఎస్పీకి లేఖ రాయాలని కలెక్టర్ కు మంత్రి సూచించారు. అదే విధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎంత మేరకు షాపింగ్ కాంప్లెక్స్ లు నిర్వహిస్తున్నారు అనే వివరాలు మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఎక్కడైనా విద్యార్థినిల వసతి గృహాల్లో మగవారు పని చేస్తుంటే వెంటనే తొలగించాలని, కేవలం మహిళ సిబ్బంది మాత్రమే విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనారోగ్యం లేదా ఇతరత్రా కారణాలతో వసతిగృహాల్లోని విద్యార్థులు ఇంటికి వెళ్లే సమయంలో వారు ఇంటికి చేరుకునే వరకు వసతి గృహాల వార్డెన్లు, ఏఎస్ డబ్ల్యు ఓ లు బాధ్యత తీసుకోవాలన్నారు. అదేవిధంగా పేరెంట్స్ కు మెసేజ్ ఇవ్వాలని సూచించారు.

డా.బిఆర్.అంబేద్కర్ గురుకులంకు సంబంధించి వసతి గృహాల్లో రక్త హీనత ఉన్న విద్యార్థినిలకు సరైన పోషకాలు అందజేయాలన్నారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖకు సంబంధించి ప్రతి సోమవారం ఉమ్మడి జిల్లాలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే విభిన్న ప్రతిభావంతుల కోసం ఒక సిబ్బందిని నియమించాలని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అధికారిని మంత్రి ఆదేశించారు. అదే విధంగా గురుకులం పాఠశాలలో డా.బిఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు.

వసతి గృహాల్లో సంబంధిత శాఖలు చేపడుతున్న నిర్మాణాలపై పూర్తి స్థాయిలో మంత్రి సమీక్ష నిర్వహించి నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీర్లను మంత్రి ఆదేశించారు.అదే విధంగా అన్ని వసతి గృహాలకు దోమ తెరలు ఏర్పాటు చేయడంతో పాటు వాష్ రూమ్స్ లో స్విచ్లు ఏర్పాటు చేయాలన్నారు. వసతి గృహాల ప్రాంగణంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. వసతి గృహాలకు ఇనుప గ్రిల్స్, కాంపౌండ్ ఎత్తు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు.

వసతి గృహాల్లో చదువుకునే పదో తరగతి విద్యార్థులు 5 మంది, జూనియర్ ఇంటర్మీడియట్ లో 124 మంది, ద్వితీయ ఇంటర్లో 31 మంది ఫెయిల్ అయ్యారని, దీనిపై హాస్టల్ వార్డెన్స్, ఏఎస్డబ్ల్యూఓ లను కారణాలు అడిగి తెలుసుకుని తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. ప్రతినెల పిటిఎం సమావేశానికి వెళ్లి ఏ బి సి గ్రూపు పిల్లలను దగ్గర ఉండి జాగ్రత్తగా చదివించాలి. పిల్లలను పాస్ చేసే బాధ్యత మీపై ఉందని పేర్కొన్నారు. ఇటీవల ఇంటర్ 10లో మార్కులు బాగా వచ్చిన పిల్లలకు నగదు పురస్కారం అందజేశామని ఇది ఇతర పిల్లలకు ప్రోత్సాహంగా పనిచేస్తుందన్నారు. వసతి గృహాలలో బెస్ట్ ప్రాక్టీసెస్ పై పిల్లలకు బాగా అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా రాత్రులు వాచ్ గార్డ్ ఉండేలా జిల్లా ఎస్పీకి నివేదించి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతినెల సివిల్ రైట్స్ తప్పకుండా చేయాలని సూచించారు. వసతి గృహాల్లో ఉండే వారికి జ్వరము, రక్తహీనత లేకుండా చూడాలని, డయేరియా, డెంగు వ్యాధులు సోకకుండా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించిచర్యలు తీసుకోవాలని, అలాగే పాముకాటు, కుక్క కాటు, ఎలుక కాటులకు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఎస్సీ కార్పొరేషన్ పరిధిలో ఉన్న షాపు కాంప్లెక్స్ భవనాలన్నింటికీ పెయింటింగ్స్ వేయించి రెంట్లకు ఇవ్వాలన్నారు. జిల్లాలో మొత్తంగా ఏడు షాపింగ్ కాంప్లెక్స్లు, 57 షాప్స్ ఉన్నాయని, ఇందులో 46 ఫంక్షన్ లో ఉన్నాయన్నారు. మిగిలిన వాటిని కూడా అవసరమైన మరమ్మత్తులు చేయించి ఫంక్షన్ లోకి తీసుకురావాలని చెప్పారు. జి ఎస్ డబ్ల్యూ ఎస్ కు సంబంధించి ఏబీసీ కేటగిరీలో డిసిగ్నేటెడ్ పోస్ట్ లన్ని భర్తీ చేశామన్నారు. వికలాంగ శాఖ ద్వారా త్రీ వీలర్ ట్రై సైకిల్ ఇస్తున్నామని అవే కాకుండా ఆర్టిఫిషియల్ కాళ్లు చేతులు వినికిడి మిషన్స్ కూడా ప్రభుత్వం అందజేస్తుందని ఈ విషయాన్ని విస్తృతంగా అవగాహన కల్పించాలని వికలాంగ శాఖ అధికారులను ఆదేశించారు. ఇకపై ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించే పీజీఆర్ఎస్ కు లిప్ మూమెంట్ కలిగిన ఒక టీచర్ను డిప్యూటీ చేయాలన్నారు. చెవిటి మూగ బదిరుల పాఠశాలల్లోని బాత్రూంలో కాలింగ్ బెల్స్ ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. స్వాంతన పథకం కింద ప్రమాదం జరిగితే మూడు లక్షలు ఇస్తున్నామని, సంక్షేమం కింద హెల్త్ వింగ్స్ ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. ప్రతి టాయిలెట్ లో లైట్లు ఉండాలని స్విచ్లు ట్యూబ్ లైట్స్ బోర్డు ఏర్పాటుకు నిధులు ఇవ్వడం జరుగుతోందని పేర్కొన్నారు. వసతిగృహాల్లోని పిల్లల సంక్షేమంపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిధులు కేటాయిస్తున్నారని వాటన్నిటినీ సద్వినియోగం చేసి ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ ఒక మార్గదర్శకంగా నిలిపేందుకు అధికారులు బాధ్యతాయుతంగా కృషి చేయాలని మంత్రి పేర్కొన్నారు.

సమావేశంలో జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న సంక్షేమ వసతి గృహాలను నేడు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగిందన్నారు. అదేవిధంగా ఎక్కడైతే పాఠశాల సామర్థ్యం కంటే తక్కువగా ఉంటే రెండు పాఠశాలలను ఒక పాఠశాలగా ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. అంతేకాకుండా కోవెలకుంట్ల, బనగానపల్లి మండలాల్లో సరిగా లేని భవనాలను తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా పదవ తరగతి, ఇంటర్మీడియట్ లలో ఉత్తమ ప్రతిభ కనబరిచే విద్యార్థులనే కాక చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వారు తప్పనిసరిగా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి నెల చివరి వారంలో నిర్వహించే సివిల్ రైట్స్ డేను నిర్వహించడంతోపాటు ప్రతి విద్యార్థినిలు ఉండే వసతి గృహంలో మహిళా సిబ్బంది విధులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా వసతి గృహాలకు నిత్యం పోలీస్ పెట్రోలింగ్ ఉండే విధంగా జిల్లా ఎస్పీకి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందన్నారు.

*నందికొట్కూరు శాసనసభ్యులు జయసూర్య మాట్లాడుతూ… తన నియోజకవర్గంలో ఉన్న సాంఘిక సంక్షేమ వసతి గృహాలు నిర్వహణ, వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల సంఖ్య తదితరాలలో సరైన సమాచారం అందించేలా అధికారులకు తగు ఆదేశాలు జారీ చేయాలని మంత్రిని, కలెక్టర్ ను కోరారు. ఎక్కడైనా స్ట్రెంత్ తక్కువ ఉన్న వాటిని ఇంటిగ్రేటెడ్ చేసి బలోపేతం చేసేందుకు తాను కూడా కృషి చేస్తానని ఈ సందర్భంగా శాసనసభ్యులు పేర్కొన్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో ఫీడర్ స్కూల్స్ కాలేజీలను కోఆర్డినేట్ చేసి వాటిని బలోపేతం చేసేందుకు ఎమ్మెల్యే గారితో సమన్వయం చేసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డి.రాము నాయక్, నంద్యాల సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చింతామణి, కర్నూలు సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాధిక, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అధికారి రయిజ్ ఫాతిమా, డిసిఓ శ్రీదేవి, జిఎస్డబ్ల్యూఎస్ కోఆర్డినేటర్ ఖాదర్ బాషా, వసతి గృహాల సంక్షేమ అధికారులు, ప్రిన్సిపల్స్, వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *