-అమరావతి నిర్మాణానికి సంబంధించిన పలు అంశాలపై అధ్యయనం చేస్తున్న మంత్రి.
-సింగపూర్ లో వేస్ట్ మేనేజ్ మెంట్ ను పరిశీలించిన మంత్రి
-అర్బన్ రీ డెవలప్ మెంట్ అధారిటీ,రోడ్ డెవలప్ మెంట్ అధారిటీ అధికారులతో విడివిడిగా సమావేశాలు
-సింగపూర్ లో మొట్ట మొదటి భారీ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్ సందర్శించిన మంత్రి
-ఐకానిక్ వర్టికల్ గార్డెన్ నిర్మాణాలను పరిశీలించిన మంత్రి,సీఆర్డీయే కమిషనర్ కన్నబాబు
సింగపూర్, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ సింగపూర్ పర్యటన కొనసాగుతుంది.అమరావతి నిర్మాణానికి సంబంధించిన పలు అంశాలపై మంత్రి నారాయణ అధ్యయనం చేస్తున్నారు..సింగపూర్ తరహా స్మార్ట్ సిటీగా అమరావతి నిర్మించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది…దీనికోసం సింగపూర్ ప్రభుత్వం అనుసరిస్తున్న పలు విధానాలను అమరావతి కోసం ఉపయోగించుకునే ఆలోచనలో ఉంది…అమరావతి నిర్మాణంలో కీలక పాత్ర వహిస్తున్న మంత్రి నారాయణ….రాజధానిని ప్రపంచంలో అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దేలా సింగపూర్ లోని బెస్ట్ ప్రాక్టీసెస్ ను అధ్యయనం చేస్తున్నారు.గురువారం సింగపూర్ లో పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు మంత్రి నారాయణ..సీఆర్డీయే కమిషనర్ కన్నబాబుతో కలిసి పలు అంశాలపై అధ్యయనం చేసారు.
గురువారం ఉదయం సింగపూర్ లో వేస్ట్ మేనేజ్ మెంట్ పై అధ్యయనం చేసారు…సింగపూర్ లో ఘన వ్యర్ధాల నిర్వహణ కోసం అక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యలను అధికారులు మంత్రి నారాయణకు వివరించారు..,చెత్త తరలింపునకు వినియోగిస్తున్న వాహనాలను మంత్రి పరిశీలించారు…ఆధునిక టెక్నాలజీతో చెత్తను సేకరించి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ లకు తరలిస్తున్న విధానాన్ని మంత్రి నారాయణ పరిశీలించారు.
ఆ తర్వాత సింగపూర్ ల్యాండ్ ట్రాన్స్ పోర్ట్ అధారిటీ, ప్రతినిధులతో సమావేశమయ్యారు సమావేశమైన మంత్రి నారాయణ…సింగపూర్ లో ఉపరితల రవాణా సౌకర్యాలు,మౌళిక వసతుల కల్పన,రోడ్ల నిర్మాణం వంటివి ఈ అధారిటీ పర్యవేక్షణలో ఉంటాయి…ప్రజా రవాణా వ్యవస్థ,వాకింగ్ ట్రాక్ లు,సైక్లింగ్ ట్రాక్ ల నిర్మాణం కూడా ఈ అధారిటీ పరిధిలోనే ఉంటాయి..ప్రస్తుతం సింగపూర్ లో ఉన్న రవాణా వ్యవస్థ గురించి అక్కడి అధికారులు మంత్రి నారాయణకు వివరించారు…అమరావతిలో కూడా సింగపూర్ తరహాలో రోడ్ల నిర్మాణం,వాకింగ్,సైక్లింగ్ ట్రాక్ లు నిర్మించనుంది ప్రభుత్వం…ఆయా నిర్మాణాలకు సంబంధించి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు మంత్రి.
మధ్యాహ్నం సింగపూర్ అర్బన్ రీ డెవలప్ మెంట్ అధారిటీ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు మంత్రి నారాయణ,సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు..సింగపూర్ అభివృద్దికి సంబంధించి ఎప్పటికప్పుడు ఈ అధారిటీ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది…సింగపూర్ లో భవన ప్రభుత్వ భవన నిర్మాణాలు డిజైన్లు రూపొందించడం,భూములపై పర్యవేక్షణ ఈ అధారిటీకి ఉంటుంది…రాబోయే 15 ఏళ్లకు సింగపూర్ అభివృద్దికి ఈ అధారిటీ మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేసింది.
మధ్యాహ్నం సింగపూర్ లో JTC పౌల్ట్రీ ప్రాసెసింగ్ హబ్ ను మంత్రి నారాయణ సందర్శించారు…JTC పౌల్ట్రీ ప్రాసెసింగ్ యూనిట్ సింగపూర్ లోని మొట్ట మొదటి వన్ స్టాప్ పౌల్ట్రీ ప్రాసెసింగ్ యూనిట్.ఇక్కడ లైవ్ చికెన్ తో పాటు చికెన్ ప్రాసెసింగ్,ప్యాకింగ్,డెలివరీ చేస్తున్న విధానాలను మంత్రి నారాయణ అధ్యయనం చేసారు.చికెన్ వ్యర్థాలతో కూడా ఇతర ఉత్పత్తులను తయారు చేస్తున్న యూనిట్ ను మంత్రి పరిశీలించారు…రాష్ట్రంలో చికెన్ వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో ప్రాసెస్ చేసే యూనిట్లను ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం.
ఇక గురువారం సాయంత్రం మంత్రి నారాయణ సింగపూర్ లోని గార్డెన్స్ బై ది బే ను సందర్శించారు…సింగపూర్ లో ఉన్న అతిపెద్ద వర్టికల్ గార్డెన్ ఇది…ప్రపంచవ్యవాప్తంగా ఉన్న అనేక రకాల మొక్కలతో ఈ గార్డెన్ ఉంటుంది.క్లౌడ్ ఫారెస్ట్,ఫ్లవర్ డోమ్ లతో ఎంతో అందంగా ఆకర్షణీయంగా సింగపూర్ కే తలమానికంగా ఈ గార్డెన్స్ బై ది బే ఉంటుంది..అమరావతిలో బ్యుటిఫికేషన్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు సీఎం చంద్రబాబు…అమరావతి బ్యుటిఫికేషన్ లో సింగపూర్ వర్టికల్ గార్డెన్ ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి నారాయణ నిర్ణయించారు.శుక్రవారం కూడా సింగపూర్ లోనే పర్యటించనున్నారు మంత్రి…రాత్రికి సింగపూర్ నుంచి మలేషియా వెళ్లనున్నారు.
Prajavartha Online Telugu News