Breaking News

పి ఫోర్ మార్గదర్శకాలను విధిగా పాటిస్తూ మార్గదర్శిలను గుర్తించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పి ఫోర్ మార్గదర్శకాలను విధిగా పాటిస్తూ మార్గదర్శిలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి పి – ఫోర్ కార్యక్రమం పురోగతిపై సంబంధిత నియోజకవర్గాల ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పి ఫోర్ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. జిల్లాలో పేద కుటుంబాలకు చేయూతనందించి వారినీ పైకి తీసుకుని రావాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం అన్నారు. జిల్లాలో ప్రస్తుతం 53,759 పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా గుర్తించామని, అందులో 48,549 బంగారు కుటుంబాలను 4,294 మార్గదర్శి లకు దత్తత తీసుకునేలా అనుసంధానం చేశామన్నారు. జిల్లాలో ఇంకా మార్గదర్శిలను గుర్తించి పి ఫోర్ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని, ఇందులో ఏమాత్రం ఒత్తిడి చేయరాదని వారు స్వచ్ఛందంగా చేరేలా ప్రోత్సహించాలన్నారు. ఈ సమావేశంలో సిపిఓ భీమరాజు, డ్వామా, మెప్మా పిడీలు శివప్రసాద్, సాయిబాబు, పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు చిన్న నరసింహులు, మార్కెటింగ్ ఎడి నిత్యానందం, మార్క్ఫెడ్ జిల్లా మేనేజరు మురళీ కిషోర్ కొత్తగా నియమితులైన యువ వృత్తి నిపుణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *