– అత్యంత పారదర్శకంగా పెన్షన్ల పంపిణీ
– పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో
– కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్
జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లతో పేదల సామాజిక భద్రతకు భరోసా లభిస్తోందని.. అత్యంత పారదర్శకంగా పెన్షన్ల పంపిణీ జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య).. జగ్గయ్యపేట మండలం, చిల్లకల్లులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పింఛనుదారులతో మాట్లాడి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగారు. ప్రభుత్వ సిబ్బందితో ఇంటివద్దకే ఠంచనుగా వచ్చి పెన్షన్లు అందిస్తుండటంపై లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా పెన్షన్ల పంపిణీ చేపడుతున్నామని.. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో 2,30,277 పెన్షన్లకు గాను దాదాపు రూ. 99.55 కోట్లు అందించడం జరుగుతోందని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు. కార్యక్రమంలో నందిగామ ఆర్డీవో కె.బాలకృష్ణ, డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News