– సీజన్ లో ఇప్పటివరకు 48,158 మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా
– యూరియాపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
– జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్ టి ఆర్ జిల్లాలో ఖరీఫ్ _ 2025 సీజన్ అవసరాలకు ప్రస్తుతం 21,167 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సీజన్ లో ఇప్పటివరకు 48,158 మెట్రిక్ టన్నులు ఎరువులు రైతులకు సరఫరా చేయటం జరిగిందని.. సోమవారం నాటికి సాధారణ విస్తీర్ణంలో 91 శాతం (94,931 హె. కు 86,492 హె.లలో) పంటలు సాగు చేయటం జరిగిందన్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు జిల్లాకు మరో 1,500 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయటం జరుగుతుందని.. అదేవిధంగా సెప్టెంబర్ 7వ తేదీలోగా ఇంకా 2,750 మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులోకి తీసుకురావటం జరుగుతుందన్నారు. కావున రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. ఎక్కువ ధరలకు కొనుగోలు చేయకండనీ.. ఏ షాప్ వారైనా ఎక్కువ ధర డిమాండ్ చేసినట్లయితే కలెక్టరేట్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నెంబర్ 9154970454 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
Prajavartha Online Telugu News