విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సహకార రంగాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా Primary Agricultural Cooperative Societies (PACS) Presidents కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని మాజీ మంత్రి, కృష్ణా జిల్లా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ విజయవాడ బ్రాంచ్‌లో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా నెట్టెం రఘురామ్ మాట్లాడుతూ “రైతుల ఆర్థికాభివృద్ధి, సహకార సంఘాల సమర్థవంతమైన నిర్వహణ, పారదర్శక పాలన కోసం PACS Presidents సమగ్ర శిక్షణ పొందాలి. పరిపాలనా నైపుణ్యాలు, ఆర్థిక నిర్వహణ, రుణాల పంపిణీ విధానం, నూతన సాంకేతిక వినియోగం, రైతులకు సేవా దృక్పథం వంటి అంశాలపై నిపుణులు మార్గదర్శనం అందించనున్నారు” అని అన్నారు. “ఇటీవల కూటమి ప్రభుత్వ కృషితో కేడీసీసీ పరిధిలోని అన్ని PACS లు కంప్యూటరైజేషన్ పూర్తి అయ్యాయి. కాబట్టి PACS Presidents కి కంప్యూటర్ అవగాహన కూడా తప్పనిసరిగా ఉండాలి. డిజిటల్ టూల్స్ వినియోగంతో పారదర్శకత పెరుగుతుంది, రైతులకు సేవలు మరింత వేగవంతంగా అందించవచ్చు” అని స్పష్టం చేశారు. మైలవరం, విజయవాడ రూరల్, పెనమలూరు, పామర్రు, గన్నవరం పరిధిలోని సుమారు 80 మంది PACS Presidents ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. నిపుణుల ఆధ్వర్యంలో చైర్పర్సన్లకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక క్రమశిక్షణ, సహకార రంగంలో సమర్థవంతమైన నిర్వహణపై శిక్షణ ఇవ్వబడింది. అదే విధంగా నెట్టెం రఘురామ్ గారు తెలియజేస్తూ “రేపటి రోజున నందిగామ, జగ్గయ్యపేట పరిధిలోని PACS Presidents కోసం నందిగామలో శిక్షణ తరగతులు నిర్వహించబడతాయి” అని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంకు సీఈఓ శామ్ మనోహర్ గారు జిఎం రంగబాబు, చంద్రశేఖర్, ఆప్కాబ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News