తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లా వెలుగు కార్యక్రమాల సమీక్ష సమావేశానికి సెర్ప్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి మరియు సెర్ప్ ఎక్స్ -అఫీసియో సెక్రటరీ వాకాటి కరుణ హాజరయ్యారు. తిరుపతి ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశం లో సెర్ప్ సీఈఓ సిబ్బంది తో మాట్లాడుతూ రాష్ట్రంలో మొదటి సారిగా ప్రతి సంఘ సభ్యురాలి పొదుపులు, తీసుకున్న ఋణాలు, వారు చెల్లించిన ఋణాలు, మిగిలిన వాయిదాలు మొదలగు మొత్తం సమాచారం “మన డబ్బులు మన లెక్కల” మొబైల్ యాప్ ద్వారా ప్రతి సంఘ సభ్యురాలు ప్రతి నెల తెలుసుకునే వెసులుబాటు కల్పించినట్టు తెలియజేసారు.అలాగే ఒక సంవత్సర కాలం లో ప్రతి సంఘ సభ్యురాలికి కావలసిన ఋణాలు, ఋణ వినియోగం మొదలగు వివరాల తో ముందస్తుగా వారి నుండి తెలుసు కొని.. ప్రతి మహిళా సంఘ సభ్యురాలికి ఏ అవసరాలకి ఏ నెల లో ఏ రకమైన అప్పుకావాలి మొదలగు వివరాలతో వార్షిక ఋణ మరియు జీవనోపాధుల ప్రణాళిక రూపొందించి 2025-26 ఆర్ధిక సంవత్సరంలో అమలు చేయడం జరుగుతున్నదని.. అలాగే ప్రతి సంఘ సభ్యురాలిని లక్షాది కారి లేదా మిలియనీర్ గా చేసే లక్ష్యం తో సంఘ సభ్యులను మహిళా వ్యాపార వేత్తలుగా రూపుదిద్ద డానికి PMFME, PMEGP,MUDRA, ఉన్నతి, బ్యాంకు ఋణాలు మంజూరు చేయించి అలాగే వారికి సాంకేతిక నైపుణ్యాన్ని మెరుగుపరిచే శిక్షణ ఇచ్చి తద్వారా అధిక ఆదాయం గడించే లా.. మరియు వారితో పాటు అదనంగా కనీసం మరో వ్యక్తికి లేదా అంత కంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పించే లక్షంతో వెలుగు సంస్థ కృషి చేస్తోందని తెలియజేసారు. 2025-25 ఆర్థిక సంవత్సరం లో ఒక్క తిరుపతి జిల్లా లోనే సెర్ప్ వార్షిక ఋణ ప్రణాళిక ద్వారా సుమారు రూ. 3200 కోట్లకు పైగా మహిళా సంఘ సభ్యులు వివిధ రుణాలు తీసుకొంటున్నారని.. ఈరుణాలన్ని సద్వినియోగం అయ్యేలా చూసి తద్వారా వారి ఆదాయం పెరిగేలా చూడడానికి సిబ్బంది ప్రత్యేక కృషి చేయాలన్నారు..
జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వ్యవసాయ, పశుసంవర్ధక , ఉద్యాన వన , పరిశ్రమలు, చేనేత, హ్యాండీ క్రాఫ్ట్స్ వంటి శాఖల అనుసంధానం తో, బ్యాంకు వారి సహకారం తో జీవనోపాదుల కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని డి ఆర్ డి ఏ పీడీ కి సెర్ప్ సీఈఓ సూచించారు..
మండలం వారీగా బ్యాంకు మేనేజర్లు, అనుబంధ శాఖల మండల స్థాయి అధికారులు, సెర్ప్ సిబ్బంది తో కన్వెర్జెన్సీ సమావేశాలు నిర్వహించి మహిళా సంఘ సభ్యుల జీవనోపాదుల పెంపునకు మరియు మహిళా ఎంటర్ప్రెన్యూ ర్లను ప్రోత్సహించేలా చూడాలన్నారు.
జీవనోపాదుల కార్యక్రమాలను విజయంతంగా అమలు చేయుటకు సిబ్బంది( సీసీ, ఏపీఎం, డీపీఎం లు) మరింత చొరవ చూపి మనస్సు పెట్టి విధులు నిర్వహించాలని కోరారు.
అలాగే ఈ సమీక్షా సమావేశంలో పీడీ డి ఆర్ డి ఏ శోభన్ బాబు, అడిషనల్ పి. డి ప్రభావతి జిల్లా లోని సెర్ప్ డి పి ఎం లు, ఏపీఎం లు మరియు సీసీలు హాజరు అయినారు.
Prajavartha Online Telugu News