Breaking News

ఆక్రమణదారులు ఈ నెల 6వ తేదీ నాటికి స్వచ్చందంగా తొలగించుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని జిన్నా టవర్ సెంటర్ నుండి మణిపురం బ్రిడ్జి వరకు రోడ్లు, డ్రైన్లు ఆక్రమణ చేసుకొని, ట్రాఫిక్ సమస్య, మురుగుపారుదలకు అడ్డంకిగా ఉన్న ఆక్రమణదారులు ఈ నెల 6వ తేదీ నాటికి స్వచ్చందంగా తొలగించుకోవాలని తుది హెచ్చరిక చేస్తున్నామని, లేకుంటే జిఎంసి సిబ్బందే స్పెషల్ టీంలతో ఆక్రమణలను సమూలంగా తొలగిస్తారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాల వలన డ్రైన్లు పొంగి మురుగు రోడ్ల మీదకు, లోతట్టు ప్రాంతాల్లో ప్రజల నివాసాల్లోకి వెళ్లడం వలన పలు సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. అలాగే డ్రైన్ టు డ్రైన్ రోడ్ విస్తరణ చేపట్టనున్నామన్నారు. రోడ్లకు ఇరువైపులా, డ్రైన్ల మీద ఉన్న ఆక్రమణల వలన పూడికతీత పనులు చేపట్టడానికి ఆటంకంగా ఉంటుందన్నారు. కనుక ఆక్రమణదారులకు ఇప్పటికే పలు దఫాలు ఆక్రమణలు స్వచ్చందంగా తొలగించుకోవాలని తెలిపామని, ఈ నెల 6వ తేదీ తర్వాత పట్టణ ప్రణాళిక సిబ్బంది, పోలీసులు తొలగిస్తారని, అందులో జరిగే నష్టానికి ఆక్రమణదారులే భాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, రోడ్ల విస్తరణ, డ్రైన్లలో మురుగుపారుదలకు ఆక్రమణలు తొలగింపు తప్పదని, ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *