Breaking News

యజమానులు ఆవులు, ఎద్దులు, దూడలను రోడ్ల మీదకు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ కి తీవ్ర ఆటంకంగా ఉంటున్న ఆవులు, ఎద్దులు, దూడలను ఈనెల 7వ తేదీ నుండి వెంగళాయపాలెంలోని జిఎంసి బందెలదొడ్డికి తరలిస్తున్నామని, ఆయా పశువులను వాటి యజమానులు రోడ్ల మీదకు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ప్రధాన రహదారులపై పశువులు విచ్చలవిడిగా ఉండడం వలన వాహనదార్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొన్ని సమయాల్లో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే పలుమార్లు పశువులను రోడ్ల మీదకు వదిలితే తగు చర్యలు తీసుకుంటామని తెలియచేసినా యజమానులు నిర్లక్ష్యంగా ఉంటున్నారని అన్నారు. ఆవుల వలన ఎదురయ్యే సమస్యలపై వివిధ సోషల్ మీడియా, ఇతర మీడియాల్లో కూడా ప్రజల నుండి ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. ప్రజా ప్రయోజన దృష్ట్యా రోడ్ల మీద ఉండే ఆవులు, ఎద్దులు, దూడలను జిఎంసి బందెలదొడ్డి కి తరలించాలని ప్రజారోగ్య అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. బందెలదొడ్డికి తరలించిన పశువులను విడుదల చేయాలంటే భారీ అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *