Breaking News

పాత సర్టిఫికెట్లను జిఎంసికి సరెండర్ చేసి , నేమ్ బోర్డ్ లను మార్చాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటూ, సదరం సర్టిఫికెట్లను ప్రస్తుత ప్రభుత్వం సరఫరా చేసిన స్టేషనరీతో కాకుండా గత ప్రభుత్వంలో అందించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఫొటోతో ఉన్న స్టేషనరీపై ప్రింట్ చేసి అందించిన 127 వార్డ్ సచివాలయ ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రెటరి ఆర్.రామ బిల్వికాదేవి, వెల్ఫేర్ సెక్రటరీ వి.రవికుమార్ లను విధుల నుండి సస్పెండ్ చేశామని, నోడల్ అధికారి కే.సాంబశివరావు, అడ్మిన్ కార్యదర్శి ఏ.నాగమణిలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. బుధవారం కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో 127 వార్డ్ సచివాలయ కార్యదర్శులు, నోడల్ అధికారులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇప్పటికే వార్డ్ సచివాలయ పాత సర్టిఫికెట్లను జిఎంసికి సరెండర్ చేయాలని, నేమ్ బోర్డ్ లను మార్చాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా ప్రతి సచివాలయంలో నిర్దేశిత నేమ్ బోర్డ్ ని ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. కాని కొందరు కార్యదర్శులు నిర్లక్ష్యంగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేసి, అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని అదనపు కమిషనర్ ని ఆదేశించారు. అలాగే నోడల్ అధికారులు ప్రతి రోజు తమకు కేటాయించిన సచివాలయాల్లో పర్యటించి, కార్యదర్శుల పనితీరుని పర్యవేక్షణ చేస్తూ ప్రతి వారం నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్లు కూడా ర్యాండమ్ గా ఆకస్మిక తనిఖీలు చేయాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే కార్యదర్శులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *