Breaking News

అన్నక్యాంటీన్లను పేదల ఆకలి తీర్చే అన్నపూర్ణగా ప్రజలు ఆదరిస్తున్నారు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అన్నక్యాంటీన్లను పేదల ఆకలి తీర్చే అన్నపూర్ణగా ప్రజలు ఆదరిస్తున్నారని, క్యాంటీన్ కి వచ్చే ప్రతి ఒక్కరికీ ఆహారం అందించేందుకు అక్షయ పాత్ర సిబ్బంది చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. బుధవారం ఆర్టీఓ ఆఫీస్ దగ్గరలోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో ఏర్పాటు చేసిన 7 అన్న క్యాంటీన్లకు ప్రతి రోజు ఆహారం కోసం వచ్చే వారి సంఖ్య పెరుగుతూ ఉందన్నారు. అక్షయపాత్ర సిబ్బంది ప్రతి రోజు ఇండెంట్ రూపొందించేప్పుడు క్యాంటీన్ కి వచ్చే వారికి ఆహారం అందలేదని ఫిర్యాదు రాకుండా చూడాలన్నారు. అలాగే జిఎంసి నుండి క్యాంటీన్ల వారీగా విధులు కేటాయించిన నోడల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ మౌలిక వసతులు కల్పించాలన్నారు. క్యాంటీన్లలో శుచి, శుభ్రత పాటించాలని స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *