Breaking News

రోడ్ల ఆక్రమణలను, అభివృద్ధి పనులను పరిశీలన…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో ప్రధాన రహదారులు వ్యాపార సంస్థల పార్కింగ్ వినియోగానికి కాదని, ప్రజల వాహనాలు రాకపోకలకని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. బుధవారం కమిషనర్ పట్టాభిపురం మెయిన్ రోడ్, జేకేసి కాలేజి రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, రోడ్ల ఆక్రమణలను, అభివృద్ధి పనులను పరిశీలించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో హోటల్స్, షాపింగ్ మాల్స్ వంటి సంస్థలు తమ భవన ప్రాంతాల్లోనే పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాలని, అలా కాకుండా ట్రాఫిక్ కి అడ్డుగా రోడ్లను ఆక్రమించి వాహనాలు పార్కింగ్ చేస్తే తగు చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్ల మీద, డ్రైన్ల మీద ఆక్రమణలు లేకుండా సచివాలయ ప్లానింగ్ కార్యదర్శి భాధ్యత తీసుకోవాలన్నారు. నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగ ఆక్రమణ ఆక్రమణ నిర్మూలన దళం రోడ్ల ఆక్రమణల తొలగింపుపై మరింత చొరవగా ఉండాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే శంకర్ విలాస్ వంతెన పనుల వలన నగర ప్రజలు ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడుతుంటే రోడ్ల ఆక్రమణ చేయడం సరికాదన్నారు. జేకేసి కాలేజి రోడ్ లో పైప్ లైన్ లీకు వర్క్ ని పరిశీలించి లీకు మరమత్తు పనులను నాణ్యతగా, వేగంగా చేయాలన్నారు. అనంతరం ఇన్నర్ రింగ్ రోడ్ లో పర్యటించి రోడ్ల పక్కన వ్యర్ధాలు వేయకుండా ప్రజారోగ్య అధికారులు పర్యవేక్షణ చేయాలని, సెంట్రల్ డివైడర్ లో పచ్చదనం పెంపుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పర్యటనలో కార్పొరేటర్ వేములపల్లి శ్రీరాం ప్రసాద, డిఈఈ రమేష్ బాబు, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *