Breaking News

దేశంలోనే విజ‌య‌వాడ పార్ల‌మెంట్ ను బెస్ట్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంగా తీర్చిదిద్దేందుకు ఎంపీ కేశినేని శివ‌నాథ్ కృషి చేస్తున్నారు

-టిడిపి రాష్ట్ర అధికార ప్ర‌తినిధి నాగుల్ మీరా
-ఎంపీ కేశినేని శివ‌నాథ్ కార్యాల‌యంలో మీడియా సమావేశం
-వైసిపి నేత‌లు దేవినేని అవినాష్, వెల్లంప‌ల్లి వ్యాఖ్య‌ల‌పై ఖండ‌న‌
-ప్ర‌జ‌లు తిర‌స్క‌రించిన నేత‌లు దేవినేని అవినాష్‌, వెల్లంప‌ల్లి శ్రీనివాస్
-విజ‌య‌వాడ ఉత్స‌వ్ పై అవ‌గాహ‌న లేకుండా మాట్లాడ‌టం వైసిపి నేత‌ల అవివేకానికి నిద్శర‌నం
-విజ‌య‌వాడ న‌గ‌ర పౌరులైతే ఎంపీ కేశినేని శివ‌నాథ్ ప్ర‌య‌త్నానికి స‌హ‌క‌రించాలి
-ఎగ్జిబిష‌న్ ఏర్పాటుకు దేవ‌దాయ శాఖకు న‌గ‌దు చెల్లింపు
-దోచుకోవ‌టం దాచుకోవ‌టం వైసిపికి పేటెంట్
-వ‌క్ఫ్ బోర్డ్ భూములు, ప్రైవేట్ భూములు, అట‌వీ భూములు, చెరువులు, ఖ‌బ‌రస్థానులు దోచుకున్న ఘ‌న‌త వైసిపి నాయ‌కుల సొంతం
-ఘ‌నంగా విజ‌య‌వాడ అమ్మ‌వారి ద‌స‌రా ఉత్స‌వాలు
-జిల్లా అధికారులు, ప్ర‌భుత్వ యంత్రాంగం, దేవ‌దాయ శాఖ పర్య‌వేక్ష‌ణ‌లో ఏర్పాట్లు
-కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వ నిధుల‌తో అమ్మ‌వారి ఆల‌య అభివృద్ది చేసేందుకు ఎమ్మెల్యే సుజ‌నాతో కృషి
-విజ‌య‌వాడ వైభ‌వాన్ని చాటి చెప్పే విధంగా విజ‌య‌వాడ ఉత్స‌వ్
-ఎంపీ కేశినేని శివ‌నాథ్ పై అబాండాలు వేస్తే ప్ర‌జ‌లు హ‌ర్షించ‌రు
-ప్ర‌జ‌ల భావాలు, వారి ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ప‌నిచేస్తున్న‌ ఎంపీ కేశినేని శివ‌నాథ్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజ‌య‌వాడ పార్ల‌మెంట్ ను దేశంలోనేఏ ఒక బెస్ట్ పార్ల‌మెంట్ గా తీర్చిదిద్దాలనే ఆశ‌యంతో ఎంపీ కేశినేని శివ‌నాథ్ ముందు వెళుతున్నారు. అందులో భాగంగానే విజ‌య‌వాడ సాంస్కృతిక వైభవాన్ని ప్ర‌పంచానికి చాటిచెప్పేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వ స‌హ‌కారంతో నిర్వ‌హించ‌నున్న విజ‌య‌వాడ ఉత్స‌వ్ పై వైసిపి నేత‌లు చేస్తున్న ఆరోప‌ణ‌లు అవాస్త‌వం. అవి వారి అవివేకానికి నిద‌ర్శ‌న‌మంటూ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేష‌న్ మాజీ చైర్మ‌న్, టిడిపి రాష్ట్ర అధికార ప్ర‌తినిధి నాగుల్ మీరా తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

ఎన్టీఆర్ జిల్లా వైసిపి ఇన్చార్జ్ దేవినేని అవినాష్ , వెల్లంప‌ల్లి శ్రీనివాస్ విజ‌య‌వాడ ఉత్స‌వ్ ను అడ్డుపెట్టుకుని ఎంపీ కేశినేని శివ‌నాథ్ పై చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌ను గురునాన‌క్ కాల‌నీలో విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో శ‌నివారం నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో నాగుల్ మీరా ఖండించారు.

ఈ సంద‌ర్భంగా నాగుల్ మీరా మాట్లాడుతూ విజ‌య‌వాడ ఉత్స‌వ్ గురించి దేవినేని అవినాష్ , వెల్లంప‌ల్లి శ్రీనివాస్ మాట్లాడిన మాటాలు దున్న‌పోతు ఈనిందంటే దూడను క‌ట్టేయ‌మ‌న్న‌ట్లు వున్నాయని ఎద్దేవా చేశారు.

విజ‌య‌వాడలో ద‌స‌రా మ‌హోత్స‌వాలు వందేళ్ల ఏళ్ల నుంచి ఎంతో ఘ‌నంగా వైభ‌వంగా జ‌రుగుతున్నాయ‌ని, ఆ ఉత్స‌వాల‌ను అద్బుత‌మైన రీతిలో ఇంకా బాగా జ‌రిగేట్లు టిడిపి హ‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో కృషి జ‌రిగింద‌న్నారు. దుర్గగుడి అభివృద్ది టిడిపి హ‌యంలోనే జ‌రిగింద‌న్నారు. దుర్గ గుడి చుట్టు ప‌క్క‌ల వున్న‌టువంటి ప్ర‌జ‌ల‌ను ఖాళీ చేయించటానికి గ‌జానికి రూ.50 నుంచి రూ.70 వేల రూపాయ‌లు చెల్లించి… దుర్గ గుడి చుట్టూ ఆహ్లాద‌క‌ర‌మైన వాతావార‌ణాన్ని టిడిపి పాల‌న‌లో సీఎం చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలో తీసుకురావ‌టం జ‌రిగంద‌న్నారు.

ద‌స‌రా ఉత్స‌వాల‌ను ఘ‌నం చేసే కార్య‌క్ర‌మాన్ని జిల్లా అధికారులు, ప్ర‌భుత్వ యంత్రాంగం, దేవ‌దాయ శాఖ చూస్తోందన్నారు..ద‌స‌రా ఉత్స‌వాలు ఘ‌నంగా నిర్వ‌హించే ప్ర‌ణాళిక బ‌ద్దంగా స‌క‌ల ఏర్పాటు ఎన్డీయే కూట‌మి చేస్తోంద‌న్నారు.

ఈ నేప‌ద్యంలో విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఒక సాహ‌స‌వంత‌మైన నిర్ణ‌యానికి శ్రీకారం చుట్టారన్నారు. ద‌స‌రా న‌వ‌రాత్రుల‌కి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ల‌క్ష‌లాది మంది భ‌క్తులు రానున్న సంద‌ర్బంలో విజ‌య‌వాడ వైభ‌వాన్ని దేశానికి ప్ర‌పంచానికి చాటి చెప్పాల‌నే అద్బుత‌మైన సంక‌ల్పంతోటి విజ‌య‌వాడ ఉత్స‌వ్ పేరుతో ఎంపీ కేశినేని శివ‌నాథ్ శ్రీకారంచుట్ట‌డం జ‌రిగింద‌న్నారు. విజ‌య‌వాడ ఉత్స‌వ్ చాలా వ్య‌యం తో కూడుకున్న కార్య‌క్ర‌మన్నారు. ఇండ‌స్ట్రీయ‌ల్, వ్య‌వసాయ రంగంలో అత్యాదునిక ప‌నిమ‌ట్లు తెలియ‌జేసేందుకు ఎగ్జిబిష‌న్ తో పాటు, పిల్ల‌లు ఆడుకోవ‌టానికి పాట‌ల‌ పోటీలతో పాటు, క్రీడ‌ల నిర్వ‌హ‌ణ తో విజ‌య‌వాడ న‌గారాన్ని ఒక అద్బుత‌మైన వాతావ‌ర‌ణంలోకి తీసుకురావ‌టానికి ప్ర‌య‌త్నిస్తుంటే..వైసిపి నాయ‌కులు చూసి ఓర్వ‌లేక విమ‌ర్శలు చేస్తుంటే ప్ర‌జ‌లు న‌వ్వుకుంటున్నార‌న్నారు.

వైసిపి నాయ‌కులు విజ‌య‌వాడ న‌గ‌ర పౌరులైతే విజ‌య‌వాడ వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఈ ప్ర‌య‌త్నానికి గ‌ర్వించాలన్నారు. విజ‌య‌వాడ న‌గ‌రం కోసం ఎంపీ కేశినేని శివనాథ్ తీసుకున్న నిర్ణ‌యానికి ప్ర‌భుత్వం స‌హ‌కారం అందిస్తుందని తెలిపారు. విజ‌య‌వాడ వైభ‌వాన్ని చాటి చెప్పే విజ‌య‌వాడ ఉత్స‌వ్ కార్య‌క్ర‌మ‌నికి జిల్లాలో వున్న పారిశ్రామిక వేత్త‌లు స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చి తాము చేయ‌గ‌ల‌గింది ఏమైనా వుంటే చెప్పాల‌ని ఎంపీ కేశినేని శివ‌నాథ్ ను కోరుతున్నారని తెలిపారు.

దేవి శ‌ర‌న్న‌వ‌రాత్రుల ఉత్స‌వాల‌కు భ‌క్తులు విజ‌య‌వాడ వ‌చ్చిన‌ప్పుడు ఎంతో ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణాన్ని భ‌క్తుల‌కు ఇవ్వాల‌నే మంచి ఉద్దేశ్యంతో విజ‌య‌వాడ ఉత్స‌వ్ నిర్వ‌హిస్తుంటే ద‌స‌రా ఉత్స‌వాలు ప‌క్క‌న పెట్టి విజ‌య‌వాడ ఉత్స‌వ్ పై దృష్టి పెట్టిన‌ట్లు వైసిపి నాయ‌కులు మాట్లాడ‌టం వాళ్ల అజ్ఞానికి నిలువెత్తు నిద‌ర్శ‌నం అన్నారు. విజ‌య‌వాడ ఉత్స‌వ్ ఎందుకు పెడుతున్నార‌నేది క‌నీస అవ‌గాహ‌న లేకుండా మాట్లాడుతుంటే ప్ర‌జ‌లు న‌వ్వుతున్నార‌ని ఎద్దేవా చేశారు.

గొల్ల‌పూడి లో 40 ఎక‌రాల దేవ‌దాయ శాఖ‌కు సంబంధించిన భూమిని ఎవ‌రి సొంతానికి తీసుకున్నారో స‌మాధానం చెప్పాలంటూ దేవినేని అవినాష్ ను సూటిగా ప్ర‌శ్నించారు. ఏ ప్ర‌భుత్వ భూమి అయినా స‌రే దేవ‌దాయ శాఖ‌, వ‌క్ఫ్ బోర్డ్ భూమి, అసైన్ ల్యాండ్ భూమిలు ఏమైనా స‌రే ఏ ప్ర‌జా అవ‌స‌రాల‌కు వాటిని ఉప‌యోగించుకోవ‌చ్చున‌ని తెలిపారు.

విజ‌య‌వాడ ఉత్స‌వ్ లో భాగంగా ఎగ్జిబిష‌న్ ఏర్పాటు చేసేందుకు దేవ‌దాయ శాఖకు ప్ర‌భుత్వ నియ‌మ‌నిబంధ‌న‌ల ప్ర‌కారం న‌గ‌దు చెల్లించన‌ట్లు తెలిపారు. గొల్ల‌పూడిలో 40 ఎక‌రాల‌ను లీజ్ కు తీసుకోలేదని, 40 ఎక‌రాలు ఎవ‌రికి రాసి ఇవ్వ‌లేదన్నారు .

వైసిపి నాయ‌కులు లాగా అక్ర‌మించుకోవ‌టానికో దోచుకుంటానికో , అమ్ముకోవ‌టానికో తీసుకోవ‌టం లేద‌న్నారు. దోచుకోవ‌టం దాచుకోవ‌టం వైసిపికి పేటెంట్ అన్నారు ప్ర‌జా అవ‌స‌రాలను గుర్తించి వాటిని ప‌రిష్క‌రించ‌ట‌మే తెలుగు దేశంపార్టీ డీ.ఎన్.యే అన్నారు. వైసిపి హ‌యంలో వైసిపి నాయ‌కులు ఎండో మెంట్స్ భూముల‌తో పాటు ,వ‌క్ఫ్ బోర్డ్ , అట‌వీ భూమ‌లు , ప్రైవేట్ భూములు , చెరువులు చివ‌రికి ఖ‌బ‌ర‌స్థాన్ లు కూడా దోచుకున్నారన్నారు. ఎంపీ కేశినేని శివ‌నాథ్ పై లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తే ప్ర‌జ‌లు హ‌ర్షించ‌ర‌ని హెచ్చ‌రించారు. వైసిపి హ‌యంలో భూదందాలు , ఇసుక దందాలు, లిక్క‌ర్ మాఫియా చేసిన నాయ‌కులు జైళ్లో కూర్చొన్నారన్నారు. వైసిపి నాయ‌కులు అవినీతి ప‌రులు. వాళ్లకి నీతి గురించి మాట్లాడే నైతిక హ‌క్కు లేదు. వాళ్లు న్యాయం, నీతి అంటూ మాట్లాడితే దెయ్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్లు గా వుంటుందన్నారు.

ఎంపీ కేశినేని శివనాథ్ డ‌బ్బులు దండుకోవ‌టానికి విజ‌య‌వాడ ఉత్స‌వ్ నిర్వ‌హిస్తున్నార‌నే వైసిపి నాయ‌కులకు బుద్ది జ్ఞానం వుండాల‌న్నారు. ఎంపీ కేశినేని శివ‌నాథ్ కి డ‌బ్బుతో పాటు మ‌న‌సు కూడా వుందనే విష‌యం తెలుసుకోవాల‌న్నారు. రాజ‌కీయాల్లోకి ఆయ‌న డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టి రాజ‌కీయాల్లోకి రావాల‌నుకోలేద‌ని, ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలిచి అడుగు పెట్టార‌న్నారు. ప్ర‌జాసేవ‌లో నిమ‌గ్న‌మై ప్రజ‌ల మ‌న‌స్సు గెలిచి విజ‌య‌వాడ పార్ల‌మెంట్ చ‌రిత్ర‌లో లేని విధంగా 2 ల‌క్ష‌ల 85 వేల ఓట్ల మెజార్టీతో భారీ విజ‌యం ఎంపీ కేశినేని శివ‌నాథ్ అందుకున్నార‌న్నారు.

దేవినేని అవినాష్ బిజెపి నాయ‌కులు, ఆర్.ఎస్.ఎస్. వాళ్లు మాట్లాడాల‌ని కోర‌టంతో ఆయ‌న రాజ‌కీయ ప‌రిజ్ఞానం అర్ధ‌మైందంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎన్డీయే కూట‌మి పాల‌న సాగుతోంద‌న్నారు. ఇక ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి గా వైద్య శాఖ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ వున్నార‌న్నారు. కాబ‌ట్టి మీరు వాళ్ల‌కి చెప్పేది ఏమిటి….ఎన్డీయే కూట‌మి నేతృత్వంలోనే విజ‌య‌వాడ ఉత్స‌వ్ జ‌రుగుతుంద‌న్నారు.

దేవినేని అవినాష్ 50 వేల ఓట్ల తేడా తో ఓడిపోతే, వెల్లంప‌ల్లి శ్రీనివాస్ 70 వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ప్ర‌జ‌లు తిర‌స్క‌రించినా ఈ వైసిపి నాయ‌కులకు ఇంకా బుద్ది రాలేద‌న్నారు. వైసిపి అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లు నిలిపిస్తే త‌న‌ సొంత డ‌బ్బుల‌తో పేద‌వాడి ఆక‌లిని ఎంపీ కేశినేని శివ‌నాథ్ తీర్చాడ‌ని గుర్తు చేశారు. అలాగే ఎంతో మంది కిడ్నీ బాధితుల‌కు అండ‌గా నిల‌బ‌డి త‌న సొంత డ‌బ్బుల‌తో వారికి వైద్యం చేయించాడ‌న్నారు. నిరుపేద‌లు ఆప‌ద‌లో వుంటే వారి అండ‌గా ఎంపీ కేశినేని శివ‌నాథ్ నిలిచాడ‌న్నారు.పేద విద్యార్ధుల‌కు స్కూల్ ఫీజులు క‌ట్టి వారి చ‌దువుకు ఎలాంటి ఆటంకం లేకుండా చూశాడ‌న్నారు.

దేవదాయ భూములు గురించి మాట్లాడే అర్హ‌త వెల్లంప‌ల్లి శ్రీనివాస్ కి వుందా అంటూ సూటిగా ప్ర‌శ్నించారు. వైసిపి పాల‌న‌లో 120 గుడులు ధ్వంసం చేసిన‌ప్పుడు ఎందుకు మాట్లాడ‌లేక పోయావో స‌మాధానం చెప్పాల‌న్నారు. వెల్లంప‌ల్లి ఇంటి ముందు వున్నఅమ్మ‌వారి గుడిలో వెండి సింహాలు మాయం అయితే నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు ఎందుకు వుండిపోయాడో స‌మాధానం చెప్పాల‌న్నారు. తిరుప‌తి లో అన్య‌మ‌త ప్ర‌చారం జ‌రుగుతుంటే అడ్డుకోకుండా మౌనం ఎందుకు వ‌హించావో సమాధానం చెప్పాల‌న్నారు.

ప్ర‌జ‌లు వైసిపి నాయ‌కుల చెప్పే అబ‌ద్దాల‌ను న‌మ్మే ప‌రిస్థితిలో లేర‌న్నారు. కేశినేని శివ‌నాథ్ ఎన్టీఆర్ జిల్లాను అభివృద్ది చేసేందుకు అద్బుత‌మైన ప్ర‌య‌త్నం చేస్తా వున్నారన్నారు. జ‌గ్గ‌య్య‌పేట నందిగామ నియోజ‌క‌వ‌ర్గాల మ‌ధ్య‌లో డిపెన్స్ క్ల‌స్ట‌ర్ తీసుకురాబోతున్నారని వెల్ల‌డించారు.

ఎంపీ కేశినేని శివ‌నాథ్ విజ‌య‌వాడ పార్ల‌మెంట్ ను అభివృద్ది చేసేందుకు స‌మ‌గ్ర ప్రణాళిక తో ముందుకు వెళుతున్నాడ‌న్నారు. ఎప్ప‌టి నుంచో పెండింగ్ లో వున్న మిగిలిన‌ వెస్ట్ బైపాస్ నిర్మాణాన్ని, రైతులు, క‌రెంట్ అధికారులు, నేష‌న‌ల్ హైవే అధికారుల‌తో మాట్లాడి త్వ‌ర‌గా పూర్తి చేసి వచ్చే నెల‌లో ప్రారంభించ‌టానికి ప్ర‌య‌త్నం చేస్తున్నాడని తెలిపారు..

రాష్ట్రంలో తిరుప‌తి త‌ర్వాత అతిపెద్ద దేవాల‌యం విజ‌య‌వాడ‌లో అమ్మ‌వారి దేవాల‌యం ..ఆ ఆల‌యాన్ని ఆదునాత‌న ప‌ద్ద‌తిలో తీర్చిదిద్ద‌టానికి, కేంద్ర , రాష్ట్ర ప్ర‌భుత్వ నిధులు తీసుకువ‌చ్చి అభివృద్ది ప‌థంలో న‌డిపించటానికి ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి ఉమ్మ‌డి ప్ర‌ణాళిక తో ప్ర‌య‌త్నిస్తున్నార‌న్నారు. ఇంద్ర‌కీలాద్రి పై యాత్రికులు వుండ‌టానికి వీలు వుండే విధంగా వ‌స‌తులు క‌ల్పించాలేందుకు పెద్ద ఎత్తున ప్ర‌ణాళిక సిద్దమ‌వుతుంద‌న్నారు. విజ‌య‌వాడ రైల్వే స్టేష‌న్ కు రూ.850 కోట్లు శాంక్ష‌న్ చేయించారని, ఈ నిధుల‌తో దేశంలోనే గ‌ర్వించ‌ద‌గ్గ రైల్వే స్టేష‌న్ గా అభివృద్ది చేసేందుకు ప‌నులు ప్రారంభం కానున్నాయ‌న్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో ఎంపీ కేశినేని చిన్ని ఎవ‌రు చేయ‌లేని విధంగా విజ‌య‌వాడ పార్ల‌మెంట్ ను అభివృద్ది చేయ‌టానికి శ్ర‌మ ప‌డుతున్నారని తెలిపారు. విజ‌య‌వాడ అభివృద్ది కాంక్షించే నాయ‌కులు ఎవ‌రైనా స‌రే ఎంపీ కేశినేని శివ‌నాథ్ కి స‌హ‌క‌రించాల‌న్నారు.

ఎన్డీయే కూట‌మి ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే కార్య‌క్ర‌మాలతో పాటు, ప్ర‌జామోగ్య‌క‌ర‌మైన ప‌నులు .ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లకు అనుగుణంగా ప‌ని చేస్తుంద‌న్నారు. తెలుగుదేశం పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ‌కు, నిజాయితీకి మారు పేరంటూ, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయ‌కులంద‌రికీ నీతిగా నిజాయితీగా వుండ‌టం. స‌రైన భాష మాట్లాడం నేర్పించార‌న్నారు .ఇక ఎంపీ కేశినేని శివ‌నాథ్ వెన‌క ప్ర‌జ‌లతో పాటు ఎన్డీయే కూట‌మి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు వున్నారని తెలిపారు. వాళ్ల భావాల‌కు ఆకాంక్ష‌లకు అనుగుణంగా ప‌ని చేస్తారని స్ప‌ష్టం చేశారు.

ఈ స‌మావేశంలో ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్య‌క్షుడు సొంగా సంజ‌య్ వ‌ర్మ, ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ సెల్ అధ్య‌క్షుడు క‌రీముల్లా, విజ‌య‌వాడ అర్బ‌న్ ఎస్సీ సెల్ మాజీ అధ్య‌క్షుడు జి.వి.న‌ర‌సింహారావు, బిసి నాయ‌కులు, మాజీ కార్పొరేట‌ర్ కాకు మ‌ల్లికార్జున యాద‌వ్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *