Breaking News

రైతులకు మరింత చేరువగా ఎస్ఎంఎస్ సాంకేతిక సలహా సేవలు

– డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు
-ఎస్ఎంఎస్ – సంక్షిప్త సమాచార సందేశాల ద్వారా సాంకేతిక సేవలను కొత్తగా ప్రవేశపెట్టిన ఎపి ఎయిమ్స్ 2.0 – APAIMS 2.0 — ( ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ సమాచార యాజమాన్య వ్యవస్థ 2.0)
-ఈ పద్ధతిలో ప్రాంతానికి అనువైన వ్యవసాయ వనరుల లభ్యత ,వాతావరణ పరిస్థితుల వివరములు,సాగునీటి నిర్వహణ ,లభ్యత ,తెగుళ్లు ,పురుగుల యాజమాన్యం మొదలగు వాటి వాస్తవ క్షేత్ర పరిస్థితులకు అనుకూలమైన సమగ్ర సాగు సమాచార సలహాలు అందించడం .
-తక్కువ సమయంలో ఎక్కువ పరిధిలోని రైతులకు బల్క్ ఎస్ఎం ఎస్ ల ద్వారా సాంకేతిక సలహాల చేరవేత
-ఈ విధానములో తెగుళ్లు ,పురుగుల తాకిడి మాత్రమే కాకుండా పోషక లోప సమస్యలను కూడా కృత్రిమ మేధ ద్వారా ముందుగానే అంచనాకు వచ్చి ,తెగుళ్లపై ముందుగానే హెచ్చరించే పద్ధతిని (Pest forewarning) ప్రవేశ పెట్టడం జరిగింది

విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర వ్యవసాయ సంచాలకులు డిల్లీ రావు ఐఏఎస్ బల్క్ SMS ల విడుదల ప్రక్రియ ( SMS PUSH DOWN) కార్యక్రమం ప్రారంభించిన తర్వాత పత్రికా ప్రకటన విడుదల చేస్తూ వ్యవసాయ శాఖ రైతులకు సమయానుకూలమైన తక్షణ క్షేత్ర స్థాయి సాంకేతిక సలహాలను,సూచనలను అందించే కార్యక్రమాన్ని నూతనంగా ప్రవేశ పెట్టడం జరిగింది అని తెలిపారు . ఇందుకోసం ఎపి ఎయిమ్స్ 2.0 APAIMS 2.0 పథకం లో భాగంగా వాసర్ లాబ్స్ అభివృద్ధి చేసిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్ వ్యవస్థ ద్వారా పంటల, ప్రాంతాల వారీగా ప్రత్యేకంగా రూపకల్పన చేసిన సలహాలను ప్రత్యక్షంగా ,వాస్తవ సమయములో క్షేత్ర స్థాయి పరిస్థితులకు అనువైన సూచనలను ఎక్కువ సంఖ్యలో కావలసిన రైతులకు SMS సంక్షిప్త సమాచార సందేశాలను చేరవేయడం జరుగుతుంది.
క్షేత్ర స్థాయిలో గ్రామ రైతు సేవా కేంద్రం సిబ్బంది ,మండల వ్యవసాయ అధికారులు , ఏపిపిఎస్ ఎస్ APPSS ఆంధ్ర ప్రదేశ్ పురుగుల నిఘా సర్వే వ్యవస్థ యాప్ APP ద్వారా క్షేత్ర స్థాయిలో సేకరించి పొందుపరిచే ఫోటోలు , తదితర సమాచారం ఆధారముగా ఒకే సమయములో ఆ ప్రాంతానికి చెందిన ఎక్కువ మంది రైతులకు క్షేత్రస్థాయి తక్షణ అవసరాలకు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం తో కూడుకున్న సలహాలు రూపొందించబడతాయి. గత కొన్నేళ్ల వారసత్వ సాగు సమాచార డేటా ,సాగు నీరు, పురుగుల ,తెగుళ్లకు అత్యంత అనుకూలముగా ఉండే వాతావరణ పరిస్థితులు ,వర్ష పాతం తదితర అంశాలను ఎంచుకుని కృత్రిమ మేధ ద్వారా రైతులు తమ ప్రాంతములోని పంటలకు మరియు వ్యవసాయ పద్ధతుల అవసరానికి అనుగుణమైన క్షేత్ర స్థాయి ముందస్తు హెచ్చరికలు , పరిష్కార మార్గం పొందగలుగుతారని తెలియచేశారు . ఎస్ఎంఎస్ ల ద్వారా సమాచారం పొందడం కేవలం ఖరీదు తో కూడుకున్న ఆండ్రాయిడ్ , యాపిల్ మొబైల్ ఫోన్ లకు మాత్రమే పరిమితం కాకుండా , సాధారణ ఫీచర్లు తో ఉన్న మొబైల్ ఫోన్ లను ఉపయోగించే రైతులు కూడా ఈ ప్రయోజనాన్ని పొందగలుగుతారని తెలిపారు .
ఒక ప్రాంతంలోని రైతులకు,వారికి అవసరమైన తక్షణ సాంకేతిక సలహాలను బల్క్ SMS సంక్షిప్త సమాచార పుష్ ద్వారా పెద్ద సంఖ్యలో సమూహంగా పంపిణీ చేయబడటం అనే అంశం వల్ల రైతులు తెగుళ్లు పురుగులపై ఆధునిక జ్ఞాన సముపార్జన పొంది స్వయం నిర్ణయాలు తీసుకునేలా దోహదపడి ,రైతులను నిపుణులుగా తీర్చి దిద్దుతుందని డిల్లీ రావు తెలిపారు .
ఈ నూతనముగా ప్రవేశపెట్టిన SMS సలహాల ద్వారా వ్యవసాయ శాఖ అందించే సమాచార పరిధి తక్కువ సమయంలో విస్తరించడమే కాకుండా, రైతులు తక్షణమే ఉపయోగించకోగలిగే సాంకేతిక పరిజ్ఞానం పొందుతారని ఇది వారికి సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కల్పించి, ఉత్పాదకతను పెంచడంలో, అలాగే సాగులో ఎదురయ్యే సమస్యలను తగ్గించడంలో తోడ్పడుతుంది తెలిపారు. వారు మాట్లాడుతూ వ్యవసాయ శాఖ ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకు నూతన సాంకేతిక పరిజ్ఞానం తో కూడుకున్న వ్యవసాయ విధానాలను అంది పుచ్చుకుని రాష్ట్రములోని రైతులకు మరింత అవగాహన పెంచేలా కృషి చేస్తున్నామని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *