Breaking News

బాధ్య‌త‌ను అర్థం చేసుకోండి.. అమ‌లుప‌ర‌చండి.. అమ్మ ద‌య పొందండి..

– గూగుల్ మ్యాప్స్ సహాయంతో విధుల నిర్వహణపై అధికారులకు క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ వివరణ
– ద‌స‌రా మ‌హోత్స‌వాల్లో బాధ్యతగా విధులు నిర్వహించండి..
– జిల్లా యంత్రాంగానికి కలెక్టర్ స్ప‌ష్ట‌మైన ఆదేశాలు
– సామాన్య భ‌క్తుల‌కు సంతృప్తిక‌రంగా అమ్మ ద‌ర్శ‌నం ల‌భించేలా చూడ‌టం మ‌న బాధ్య‌త‌
– పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన కలెక్టర్, పోలీస్ క‌మిష‌న‌ర్‌

విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త :
దసరా మహోత్సవాల విధుల నిర్వ‌హ‌ణ‌లో ముందుగా అప్ప‌గించిన బాధ్య‌త‌ల‌ను స‌రైన విధంగా అర్థంచేసుకొని క్షేత్ర‌స్థాయిలో అమ‌లుచేయ‌డం ద్వారా సామాన్య ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సేవ‌లందించి.. అమ్మ ద‌య పొందాల‌ని.. అప్పుడే విధుల నిర్వ‌హ‌ణ‌కు సార్థ‌క‌త ల‌భిస్తుంద‌ని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
శనివారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో దసరా మహోత్సవాల విధుల నిర్వహణపై జిల్లా అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ న‌గ‌రంలోని ప్రతి సెక్టార్ లోను జిల్లా అధికారులు, రెవెన్యూ, పోలీస్‌, అగ్నిమాప‌క‌, వైద్య ఆరోగ్యం, వీఎంసీ.. ఇలా వివిధ శాఖ‌ల సిబ్బంది మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తారని తెలిపారు. ప్రతి అధికారికి ఆ సెక్టార్ గురించి స్ప‌ష్ట‌మైన అవగాహన ఉండాలని చెప్పారు. ఆయా సెక్టార్ల‌లో ఎలాంటి ఇబ్బంది వ‌చ్చినా త‌క్ష‌ణ‌మే స్పందించి క‌మాండ్ కంట్రోల్ కేంద్రానికి స‌మాచార‌మివ్వాల‌ని.. యుద్ధ‌ప్రాతిప‌దిక‌న స‌మ‌స్య ప‌రిష్కారానికి చొర‌వ‌చూపాల‌న్నారు. ఈ మొత్తం ప్ర‌క్రియ‌లో స‌మ‌న్వ‌యం ప‌రంగా ఇబ్బందిలేకుండా చూసుకోవాల‌న్నారు. అయిదు నిమిషాల ముందే డ్యూటీ పాయింట్‌కు చేరుకొని ముందు షిఫ్ట్ ఆఫీస‌ర్‌ను రిలీవ్ చేయాల‌న్నారు. ఆయా సెక్టార్ల‌పై సెక్టార్ ఇన్‌ఛార్జ్‌ల‌కు, సిబ్బందికి స్ప‌ష్ట‌మైన మైండ్ మ్యాప్‌తో అవ‌గాహ‌న క‌లిగి ఉండాల‌న్నారు. ముందు జాగ్ర‌త్త‌గా అత్య‌వ‌స‌ర ప్ర‌ణాళిక‌ను సిద్ధంగా ఉంచుకోవాల‌న్నారు. ఆయా సెక్టార్ల‌లో అనుమానాస్ప‌ద‌, ఉత్స‌వాల‌కు విఘాతం క‌లిగించే ప‌రిస్థితుల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. వృద్ధులు, మ‌హిళ‌లు, గ‌ర్బిణీలు, బాలింత‌లు, చిన్నారులు, దివ్యాంగుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ద‌ర్శ‌నం ల‌భించేలా అందుబాటులో ఉన్న అన్ని వ‌న‌రుల‌ను ఉప‌యోగించుకునేలా చూడాల‌న్నారు. వారికి అవ‌స‌ర‌మైన స‌హాయ‌స‌హ‌కారాలు అందించాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు.
36 సెక్టార్ ఇన్‌ఛార్జులు, సిబ్బంది దృష్టిసారించాల్సిన అంశాలు:
సెక్టార్ బాధ్య‌తలు చూస్తున్న ఇన్‌ఛార్జులు, సిబ్బంది ముఖ్యంగా భ‌క్తుల భ‌ద్ర‌త‌, సుర‌క్షిత తాగునీరు, శుభ్ర‌మైన ఆహారం, ఆహ్లాద‌క‌ర ప‌రిస‌రాలు, సుర‌క్షిత క్యూలైన్లు, మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌, చిన్నారుల భ‌ద్ర‌త‌, సూచిక బోర్డులు, స‌మాచార బోర్డులు, ప‌బ్లిక్ అనౌన్స్‌మెంట్‌, మ‌త‌సామ‌ర‌స్యాన్ని ప్రోత్స‌హించ‌డం వంటివాటిపై దృష్టిసారించాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు. ఎప్ప‌టిక‌ప్పుడు భ‌క్తుల‌తో మాట్లాడి సౌక‌ర్యాల‌పై ఫీడ్‌బ్యాక్ తీసుకోవాల‌ని.. వారి ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఏవైనా స‌రిదిద్దుకోవాల్సిన అంశాలు ఉంటే వెంట‌నే చ‌క్క‌దిద్దాల‌న్నారు. ప్ర‌తి సెక్టార్‌కూ ఆ ప్రాంత ప‌రిస్థితుల ఆధారంగా ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేసుకోవాల‌ని ఆదేశించారు. ఎక్క‌డా ట్రాఫిక్ జామ్ కాకుండా భ‌క్తుల‌కు ఇబ్బందిలేకుండా చూడాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ఆదేశించారు. మైకు, ఫీడ్‌బ్యాక్ క్యూఆర్ కోడ్‌, అత్య‌వ‌స‌ర ఫోన్ నంబ‌ర్లు, పార్కింగ్ స్థ‌లాల జాబితా, వీఐపీ బోర్డింగ్ ప్రాంతాల జాబితాల‌ను సిద్ధంగా ఉంచుకోవాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు. భ‌క్తుల క్షేమం, భ‌ద్ర‌త ప‌రంగా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై సీపీ ఎస్‌వీ రాజ‌శేఖ‌ర‌బాబు సూచ‌న‌లు చేశారు. శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం కల‌గ‌కుండా, అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌క్కుండా స‌మ‌ష్టిగా ప‌నిచేయాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని సీపీ రాజ‌శేఖ‌ర‌బాబు పేర్కొన్నారు.
స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ ధ్యాన‌చంద్ర హెచ్ఎం, డీఆర్‌వో ఎం.ల‌క్ష్మీన‌ర‌సింహం, ఆర్‌డీవోలు కావూరి చైత‌న్య‌, కె.బాల‌కృష్ణ‌, కె.మాధురి త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *