Breaking News

ఆంధ్ర ప్రదేశ్ పునర్ నిర్మాణానికి ప్రతి ఒక్కరి సహకారం అత్యావశ్యకం

-రాష్ట్ర అబ్కారీ, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
-ఇకపై “రెరా” పాత్ర స్నేహితుడి భూమిక: అరె శివారెడ్డి
-బెజవాడ వాసుల విశేష ఆదరణ చూరగొన్న నారెడ్కో స్థిరాస్తి ప్రదర్శన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ పునర్ నిర్మాణానికి ప్రతి ఒక్కరి సహకారం అత్యావశ్యకమని రాష్ట్ర అబ్కారీ, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. విజయవాడ ఎ కన్వెన్షన్ లో జరుగుతున్న నారెడ్కో అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్–2025 ను ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ స్థిరాస్తి రంగం ఉన్నతిని దృష్టిలో ఉంచుకొని దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే అన్నారు. మైనింగ్ అనుమతుల పరంగా సరళీకృత విధానాలు అమలు చేస్తున్నామని, ప్రజలకు మెరుగైన పాలన అందించడం ధ్యేయంగా ముఖ్యమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం పాలన వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లోనూ వెనుకబడి పోయిందని, గతంలో ఇక్కడ ఎకరం అమ్మితే తెలంగాణలో రెండు ఎకరాలు వచ్చేదని అన్నారు. సీఎం తీసుకున్న చర్యల కారణంగా ప్రస్తుతం సరిహద్దు రాష్ట్రంలో పది ఎకరాలు అమ్మినా ఆంధ్ర రాష్ట్రంలో ఎకరం భూమి రావటం లేదన్నారు. నారెడ్కో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనతో కొనుగోలుదారులకు విస్తృత అవకాశాలు కల్పించటం అభినందనీయమన్నారు.

సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ స్థిరాస్తి నియంత్రణ సాధికార సంస్థ చైర్మన్ ఆరె శివా రెడ్డి మాట్లాడుతూ ఇకపై రెరా స్నేహితుడుగా వ్యవహరిస్తుందన్నారు.నిబంధనలకు లోబడి చేసే దరఖాస్తులకు 24 గంటలలోనే రెరా అనుమతులు మంజూరు చేస్తామని తెలిపారు. గ్రీన్ బిల్డింగ్ విధానానికి అనుగుణంగా ముందడుగు వేయాలన్నారు. రానున్న 15 రోజులలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి భవన నిర్మాణ దారుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అసంఘటితంగా ఉన్న రియల్ ఎస్టేట్ ఏజెంట్లు రెరా లో అధికారిక ఏజెంట్ గా నమోదు కావాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వర్ణాంధ్ర నిర్మాణానికి తనవంతు సహకారం అందిస్తామని శివారెడ్డి తెలిపారు.

ఆంధ్ర ప్రదేశ్ స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మలపాటి పట్టాభి నారెడ్కో ప్రదర్శన కు హాజరయ్యారు. ఈ ప్రదర్శనలో సీఆర్డీఏ ఏర్పాటు చేసిన అమరావతి ప్రభుత్వ కార్యాలయాలు నమూనా ప్రజలను విపరీతంగా ప్రభావితం చేసింది. భవిష్యత్తు అమరావతి ముఖ చిత్రాన్ని తమ చర వాణి లలో బంధిస్తూ స్వయం చిత్రాలు దిగేందుకు ఆసక్తి చూపారు. దాదాపు పది వేల మంది ప్రజలు మూడు రోజుల ప్రదర్శనకు హాజరయ్యారు. పలువురు అక్కడికక్కడ కొనుగోలు ప్రక్రియలో తొలి అడుగు వేశారు. నారెడ్కో సెంట్రల్ జోన్ ప్రెసిడెంట్ సందీప్ మండవ, ఫెస్టివల్ కమిటీ చైర్మన్, కార్యనిర్వహక ఉపాధ్యక్షులు కిరణ్ పరుచూరి, రాష్ట్ర కార్యదర్శి వంశీ వాసిరెడ్డి, సెంట్రల్ జోన్ కార్యనిర్వాహక కార్యదర్శి హరి ప్రసాద్ రెడ్డి, కార్యదర్శి ఎస్.వి. రమణ, కోశాధికారి పి.వి. కృష్ణ, ఎస్ఎల్వి గ్రూప్ పెన్మత్స శ్రీనివాస రాజు, కోడే జగన్, చింతమనేని శరత్ కుమార్, నాదెళ్ల విజయ కుమార్ , వేమూరి సుబ్బారావు , మోహనరావు (క్రెడాయ్)సహా పలువురు సభ్యులు కూడా పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *