Breaking News

పొద్దు పోయేవరకు భక్తుల బాగోగుల పరిశీలన

-దర్శనాల తీరును క్యూలైన్లో నిలబడి పరిశీలించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అమ్మవారి దర్శనాలు జరుగుతున్న తీరుపై జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అత్యంత శ్రద్ధ చూపుతున్నారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు పలు దఫాలుగా దర్శనాలు జరుగుతున్న తీరును పరిశీలిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో స్వయంగా క్యూలో భక్తులతో వెళ్లి వారి సాధకబాధకాలు తెలుసుకుంటున్నారు. ఆదివారం రాత్రి 9 గంటలకు క్యూలైన్లో వెళ్లి దర్శనాలు జరుగుతున్న తీరును పరిశీలించారు. సామాన్య వ్యక్తిగా భక్తులతో మమేకమై అమ్మవారిని దర్శించుకున్నారు. మూల నక్షత్రం సందర్భంగా లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు చేపడుతున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *