Breaking News

మత్స్యకారుల భద్రత దృష్ట్యా పునరావాస కేంద్రాలకు వెళ్ళండి

-సముద్ర తీర ప్రాంత పర్యటనలో కలెక్టర్, ఎస్పీ

విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో తుఫాన్ పరిస్థితుల దృష్ట్యా భోగాపురం మండలం సముద్ర తీర ప్రాంతమైన ముక్కాం గ్రామాన్ని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ సోమవారం సంయుక్తంగా పర్యటించారు. ఈ సందర్భంగా వారు మత్స్యకారులతో మాట్లాడి, ప్రస్తుతం తుఫాన్ నేపథ్యంలో సముద్రంలోకి చేపల వేటకు వెళ్లకూడదని సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికలను గమనించి, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సమీప పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని కలెక్టర్ సూచించారు. పునరావాస కేంద్రాల్లో భోజనం, తాగునీరు, వసతి మరియు వైద్య సదుపాయాలు సక్రమంగా ఏర్పాటు చేయబడ్డాయని, ప్రజలు భయపడకుండా అధికారులు ఇచ్చే సూచనలను పాటించాలని, తమ భద్రత కోసం సహకరించాలని ఆయన కోరారు. తుఫాన్ సమయంలో ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఈ సందర్బంగా కలెక్టర్ ఆదేశించారు.

పోలీసులు, రెవెన్యూ, మత్స్య, పంచాయతీరాజ్ శాఖలతో సమన్వయం చేసుకొని నిరంతర పర్యవేక్షణ చేయాలని ఎస్పీ దామోదర్ ఆదేశించారు. తీర ప్రాంత గ్రామాల్లో నియంత్రణ గదులు (కంట్రోల్ రూమ్స్) ఏర్పాటు చేసి, ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *