Breaking News

సీఎం చంద్రబాబును కలిసిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి నారా చంద్రబాబుని మంగళవారం ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన ఆమె పలు అంశాలపై వారితో చర్చించారు. మహిళా సాధికారత దిశగా కమిషన్ భవిష్యత్ ప్రణాళికను సీఎంకు వివరించారు. అదేవిధంగా మొంథాన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్త చర్యల్లో భాగంగా గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించి.. వారికి వైద్యసాయం అందించడంలో ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధను మహిళా కమిషన్ తరఫున ఆమె సీఎంకు ధన్యవాదాలు తెలియజేశారు. చైర్ పర్సన్ గా పదవిలోకి వచ్చిన అనతికాలంలోనే మహిళా కమిషన్ కు మంచిపేరు తెచ్చిన రాయపాటి శైలజ ను సీఎం చంద్రబాబు అభినందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *