Breaking News

తుఫాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి…

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మొంథ తుఫాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం రాత్రి 11 గంటల కు తూఫాన్ కు కురుస్తున్న భారీ వర్షంలో ఈదురు గాలుల వల్ల నగరంలో పరిస్థితులను పరిశీలించేందుకు పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్, నిర్మల కాన్వెంట్ రోడ్డు, భాను నగర్ రోడ్, వన్ టౌన్ అండర్ ప్రాస్, దుర్గాపురం ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

మొంథ తుఫాన్ నేపథ్యంలో కురుస్తున్న వర్షాలకు రోడ్లపై వర్షపునీటి నిల్వలను మాన్సూన్ రెస్పాన్స్ టీం తొలగిస్తున్న పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ మాన్సూన్ రెస్పాన్స్ టీం అప్రమత్తంగా ఉంటూ రోడ్డుపైన వర్షపు నీటి నిల్వలు లేకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని అధికారులు మాన్సూన్ రెస్పాన్స్ టీమ్ ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవసరమైన వాహనాలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. నగరంలోని పెద్ద వృక్షాలు, హోర్డింగులు పడిపోయే అవకాశం ఉన్నందున ప్రమాదకరమైన హోర్డింగులు, వృక్షాలను ఇప్పటికే తొలగించినప్పటికీ అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉంటూ ఏమైనా ప్రమాదం గమనించిన వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు.

దుర్గాపురం లోని ఎస్ టి వి ఆర్ పాఠశాలలో ఉన్న పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. నగరంలోని పునరావస కేంద్రాలలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, అక్కడికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *