Breaking News

ఘనంగా వందేమాతరం గేయ 150 సంవత్సరాల ఉత్సవం…

-వందేమాతరం స్ఫూర్తితో వికసిక్ భారత్ నిర్మాణం
-యూనివర్సిటీ రిజిస్ట్రార్, డా. వి. రాధికా రెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వందేమాతరం గేయాన్ని స్ఫూర్తి గా తీసుకొని ప్రతీ ఒక్కరూ ఐక్యంగా దేశాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని యూనివర్సిటీ రిజిస్టార్ డా వి. రాధికా రెడ్డి అన్నారు. నగరంలోని డా. ఎన్.టి.ఆర్.ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో శుక్రవారం వందేమాతరం 150 సంవత్సరాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆదేశాలమేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలు,వాటి అనుబంధ కళాశాలలలో వందేమాతరం గీతం ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆదేశించారన్నారు. వందేమాతరం గేయాన్ని డిప్యూటీ రిజిస్టార్లు, జాయింట్ రిజిస్టార్లు, సిబ్బందితో రిజిస్ట్రార్ రాధికా రెడ్డి ఆలపించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వందేమాతర మహోన్నత గేయ విశిష్టతను తెలియజేసేలా నేటి నుండి ఏడాది పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. వందేమాతర గేయం మనలో దేశభక్తిని పెంపొందించి దేశ స్వాతంత్ర్య సమపార్జనకు మనలో ఉత్తేజాన్ని నింపిందన్నారు. వందేమాతరం వేడుకలలో పాల్గొనడం తనకు చాలా ఆనందంగా ఉందని రిజిస్ట్రార్, డా. వి.రాధికా రెడ్డి అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ రిజిస్టార్లు, జాయింట్ రిజిస్టార్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *