Breaking News

వందేమాత‌రం స్ఫూర్తితో విక‌సిత్ భార‌త్ నిర్మాణంలో ప్ర‌తిఒక్క‌రు భాగ‌స్వాములు కావాలి

– విద్వాంసులు నుంచి విప్ల‌వ‌కారుల వ‌ర‌కు ఈ గేయం క‌దిలించింది
– వందేమాత‌రం స్ఫూర్తి ప‌థంలో యువ‌త ముంద‌డుగు వేయాలి
– దేశ‌భ‌క్తిని, జాతీయతా భావ‌న‌ను పెంపొందించుకోవాలి
– రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ స్వాతంత్ర్య ఉద్య‌మంలో కోట్లాది భార‌తీయుల్లో వందేమాత‌రం గేయం స్ఫూర్తి నింపింద‌ని.. విద్వాంసులు నుంచి విప్ల‌వ‌కారుల వ‌ర‌కు ఈ గేయం క‌దిలించిందని, వందేమాత‌రం స్ఫూర్తితో వికసిత్ భార‌త్ నిర్మాణంలో ప్ర‌తిఒక్క‌రూ భాగ‌స్వాములు కావాల‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ అన్నారు.
వందేమాత‌రం గేయానికి 150 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ భాషా సాంస్కృతిక శాఖ‌, జిల్లా అధికార యంత్రాంగం, కేబీఎన్ క‌ళాశాల సంయుక్త ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం కేబీఎన్ క‌ళాశాల‌లో ప్ర‌త్యేక వేడుక‌లు జ‌రిగాయి. ఇందులో భాగంగా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌, విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ శాస‌న‌స‌భ్యులు య‌ల‌మంచిలి సుజ‌నా చౌద‌రి, రాష్ట్ర సృజ‌నాత్మ‌క‌, సంస్కృతి స‌మితి ఛైర్‌ప‌ర్స‌న్ తేజ‌స్వి పొడ‌పాటి, ఏపీ నాట‌క అకాడ‌మీ ఛైర్మ‌న్ గుమ్మ‌డి గోపాల‌కృష్ణ‌, రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఆర్.మ‌ల్లికార్జున‌రావు, జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య,
కేబీఎన్ క‌ళాశాల సెక్ర‌ట‌రీ టి.శ్రీనివాస్‌, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్ డా. వి.నారాయ‌ణ‌రావు, ప్రిన్సిప‌ల్ డా. జి.కృష్ణ‌వేణి త‌దిత‌రుల‌తో క‌లిసి భ‌ర‌త‌మాత చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు అలంక‌రించారు. అదేవిధంగా వందేమాత‌రం ర‌చయిత బంకించంద్ర చటర్జీ చిత్ర‌ప‌టానికి పూల‌మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంత‌రం దాదాపు మూడువేల మంది విద్యార్థుల‌తో వందేమాత‌రం గేయాలాప‌న చేశారు. గౌర‌వ ప్ర‌ధాన‌మంత్రి సందేశాన్ని వ‌ర్చువ‌ల్‌గా వీక్షించారు.
ఈ సంద‌ర్భంగా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్య‌మంలో పాల్గొని ఎంద‌రో ప్రాణాలు త్యాగం చేశార‌ని.. ఈ సంద‌ర్భంగా ఆ మ‌హ‌నీయులకు ఘ‌న నివాళులు అర్పిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. వందేమాత‌రం గేయం స్వాతంత్ర్య ఉద్య‌మానికి వేదిక‌గా నిలిచింద‌ని, ప్ర‌జ‌ల్లో పోరాట స్ఫూర్తిని నింపింద‌న్నారు. ఈరోజు మ‌నం స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు కార‌ణ‌మైన వందేమాత‌రం ఔన్న‌త్యాన్ని యువ‌త తెలుసుకొని, దేశ‌భ‌క్తిని, జాతీయ‌తా భావ‌న‌ను పెంపొందించుకొని ముంద‌డుగు వేయాల‌ని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ పిలుపునిచ్చారు.
శాస‌న‌స‌భ్యులు య‌ల‌మంచిలి సుజ‌నా చౌద‌రి మాట్లాడుతూ కాశ్మీరు నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు కులాలు మ‌తాల‌కు అతీతంగా దేశ ప్ర‌జ‌ల్లో వందేమాత‌రం స్ఫూర్తి నింపింద‌ని, స్వాతంత్ర్య సాధ‌న‌లో గొప్ప పాత్ర పోషించింద‌న్నారు. భావిత‌రాలు కూడా వందేమాత‌రం స్ఫూర్తిని పుణికిపుచ్చుకొని ఐక్య‌తా భావ‌న‌తో దేశాభివృద్దికి కృషిచేయాల‌న్నారు. గౌర‌వ ప్ర‌ధాని పిలుపుతో దేశ‌మంతా ఈ రోజు వందేమాత‌రం 150 ఏళ్ల వేడుక‌ల‌ను ఘ‌నంగా జ‌రుపుకుంటున్నామ‌ని పేర్కొన్నారు. ఇంత గొప్ప కార్య‌క్ర‌మంలో భాగం కావ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని శాస‌న‌స‌భ్యులు సుజ‌నా చౌద‌రి పేర్కొన్నారు.
రాష్ట్ర సృజ‌నాత్మ‌క‌, సంస్కృతి స‌మితి ఛైర్‌ప‌ర్స‌న్ తేజ‌స్వి పొడ‌పాటి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య ఉద్య‌మానికి వందేమాత‌రం శ్వాస‌గా నిలిచింద‌ని.. ప్ర‌తిఒక్క‌రి హృద‌యాల్లో నిలిచింద‌ని పేర్కొన్నారు. ఈ మహోన్న‌త గేయ విశిష్ట‌త‌ను విస్తృతం చేసేందుకు కృషిచేయ‌డం జ‌రుగుతోంద‌ని.. గౌర‌వ ప్ర‌ధాని మార్గ‌నిర్దేశ‌నంతో ఏడాది పాటు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌నున్నాయ‌ని వివ‌రించారు. వందేమాత‌రం స్ఫూర్తితో దేశాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపించేందుకు కృషిచేయాల‌ని పిలుపునిచ్చారు.
ఏపీ నాట‌క అకాడ‌మీ ఛైర్మ‌న్ గుమ్మ‌డి గోపాల‌కృష్ణ మాట్లాడుతూ క‌ళా వైభ‌వంతో వందేమాత‌రం విశిష్ట‌త‌ను వ్యాప్తి చేసేందుకు అకాడ‌మీ ద్వారా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు.
రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఆర్. మల్లికార్జున రావు, జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ మాట్లాడుతూ.. వందేమాత‌రం దేశ ప్ర‌జ‌ల్లో అచంచ‌ల‌మైన దేశ‌భ‌క్తిని పెంపొందించింద‌ని, ఈ గేయం 150 ఏళ్ల వేడుక‌ల్లో భాగంగా శుక్ర‌వారం మొద‌లు ఏడాదిపాటు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌నున్న‌ట్లు వివ‌రించారు. వందేమాత‌రం స్ఫూర్తితో గౌర‌వ ప్ర‌ధాని, గౌర‌వ ముఖ్య‌మంత్రి ఆశ‌యాలు అయిన విక‌సిత్ భార‌త్‌, స్వ‌ర్ణాంధ్ర సాధ‌న‌కు ప్ర‌తిఒక్క‌రూ కృషిచేయాల్సిన అవ‌స‌రముంద‌ని పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో పెద్దఎత్తున విద్యార్థులు, క‌ళాశాల అధ్యాప‌కులు, సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *