Breaking News

అసైన్డ్ చట్ట సవరణ పేదలకు అన్యాయమే!

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో 1977 అసైన్డ్ (బదిలీ నిసిద్ద )భూముల చట్టాన్ని సవరణ చేసి అవసరాల కోసం ఇకపై అసైన్డ్ భూములను కూడా 99 ఏళ్ల లీజుకు ఇచ్చే ప్రతిపాదన చేయడం పేదలకు అన్యాయం చేయడమేనని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ జల్లిబిల్సన్,రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు,ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఆర్ వెంకట్రావులు ఒక ప్రకటన లో తీవ్రంగా అక్షేపించారు. పేదలకు ఎన్నికలు ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల దగ్గర ఉన్న అసైన్డ్ భూములను కూడా బలవంతంగా తీసుకోవడానికి చట్ట సవరణ చేసి మంత్రమండలి ఆమోదించడం చాలా దుర్మార్గమన్నారు. ఎన్నికల ముందు గ్రామాల్లో నివసిస్తున్న పేదలకు మూడు సెంట్లు పట్టణాల్లో ఉన్న పేదలకు రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తానని ప్రగల్బాలు పలికి, అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తున్నప్పటికీ,నేటికీ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా దాటి వేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ భూములు పేదల సాగులో ఉన్నప్పటికీ వారికి రెవెన్యూ హక్కులు కల్పించకుండా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు పెడుతున్నారన్నారు.ఆధీనంలో ఉన్న అసైన్డ్ భూములను ఇప్పటికే చాలా ప్రాంతాల్లో బలవంతంగా లాక్కుంటున్నారని, ఎక్కడైతే బలవంతంగా పేదల దగ్గర భూములు తీసుకున్నారో తిరిగి వారికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల ప్రభుత్వ భూములు గుర్తించి పేదలకు ఇళ్ల స్థలాలు, సాగు భూములు పేదలకు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *