Breaking News

చిన్న తరహా పరిశ్రమలు స్థాపించే స్థాయికి మహిళలు ఎదగాలి… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కేవలం మీ పరపతి ద్వారా పొందిన బ్యాంకు రుణాలను సక్రమంగా సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెంది, చిన్న తరహా పరిశ్రమలు స్థాపించే స్థాయికి మహిళలు ఎదగాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ఆకాంక్షించారు.
బుధవారం స్థానిక మలకాపట్నంలోని రైల్వే స్టేషన్ ఎదురుగా డాక్టర్ పట్టాభి స్మారక గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాంగణంలో జరిగిన రుణమేళా కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. యూనియన్ బ్యాంకు తన పరిధిలో గల స్వయం సహాయక మహిళా సంఘాలకు 20 కోట్ల రూపాయల రుణ పంపిణీ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, బ్యాంకులకు మీ పరపతిపై ప్రగాఢ విశ్వాసం ఏర్పడటంతో ఆర్ధిక స్వావలంభనకు బ్యాంకులు ఎంతో నమ్మకంతో మీ అందరికి రుణాలిస్తున్నాయని, వాటిని సక్రమంగా సద్వినియోగం చేసుకుని రుణ వాయిదాలను తిరిగి చెల్లించాలన్నారు. అప్పు పొందడం కోసం ఏ ఒక్కరికి లంచం ఇవ్వకండని మీరు తీసుకొన్న ప్రతి రూపాయికి వడ్డీ చెల్లించాలని, ఒకరి తలను మరొకరి తలతో ముడిపెట్టి మరీ బ్యాంకు వారు మీకు రుణం ఇస్తున్నారనే అనే విషయం ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకోవాలని మంత్రి సూచించారు. స్వయం సహాయ గ్రూపులలో పురుషుల జోక్యం లేకుండా చూసుకోవాలని, ప్రతి నెల గ్రూప్ సమావేశాలు నిర్వహించుకోవాలన్నారు.రికార్డ్ ల నిర్వహణ సరిగా వుండాలని పుస్తకాలలో తప్పులు ఎంతగా దొర్లితే, ఎదుటివారికి అంతగా దొరుకుతామనే విషయం గ్రహించాలన్నారు.
మహిళా సంఘాలు పొదుపు చేసి అంతర్గత రుణాలు అందించే స్థాయికి ఎదగాలన్నారు. గ్రామిణ ప్రాంతాల్లోని మహిళలు ముందుగా డబ్బును పొదుపు చేసుకుని బ్యాంకుల నుంచి రుణాలను తీసుకుని నష్టాలపాలు కాకుండా మంచి స్వయం ఉపాధిని ఎంచుకుని లాభాలను గడించాలని హితువు చెప్పారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న స్వయం సహాయక గ్రూపుల మహిళలు ప్రతి నెల, నెల సక్రమంగా రీపేమెంట్ చెల్లిస్తు స్వయం ఉపాధి ద్వారా ఆర్ధిక సాధికారతను సాధిస్తు అంచలంచెలుగా ఎదుగాలని ఆయన పిలుపునిచ్చారు. స్త్రీ శక్తి చాల గొప్పదని, స్వయం సహాయ గ్రూపు లీడర్ క్రమశిక్షణతో గ్రూపును మంచి మార్గంలోకి గైడ్ చేసినట్లయితే ఆర్ధిక స్వావలంబన సాధించగలుగుతారని ఆయన భోదించారు.
రుణాలు ఇచ్చేముందు తమతో ఇన్సూరెన్స్ బ్యాంకు అధికారులు కట్టించుకొంటున్నారని ఒక మహిళ మంత్రికి పిర్యాదు చేసింది. ఆలా ఎక్కడ జరుగుతుందని ఆ మహిళను మంత్రి అడిగారు. పెడన బ్రాంచ్ లో ఆ విధంగా జరుగుతుందని ఆమె తెలపడంతో ఎందుకు అలా జరుగుతుందని బ్యాంకు ఉన్నతాధికారులను సభాముఖంగా మంత్రి నిలదీశారు. తీసుకునే అప్పులో ఆ విధమైన కత్తిరింపులు సరికాదన్నారు.
ఈ రుణమేళా కార్యక్రమంలో యూనియన్ బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్, ఏజీయం సతీష్ రెడ్డి, డాక్టర్ పట్టాభి స్మారక గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ ఏ. నాగేంద్ర ప్రసాద్ , ఏజీ యం పోతురాజు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *