Breaking News

అల్లూరి సీతారామరాజు జిల్లా గ్రామీణ విలేఖరులకు ఈ నెల 15, 16 తేదీల్లో పునశ్చరణ తరగతులు

-అల్లూరి సీతారామరాజు జిల్లా “చింతపల్లి” లో ఎం.పి.డి.ఒ కార్యాలయ హాల్ లో సి.ఆర్.మీడియా అకాడమీ ఆధ్వర్యంలో తరగతులు నిర్వహణ
-సి.ఆర్.మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సి.ఆర్.మీడియా అకాడమీ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా గ్రామీణ విలేఖరులకు రెండు రోజుల పాటు పునశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నట్లు అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి” ఎం.పి.డి.ఒ కార్యాలయ హాల్ లో ఈ నెల 15, 16 తేదీల్లో ఈ తరగతులు చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అనుభవజ్ఞులైన పాత్రికేయ ప్రముఖుల ద్వారా వివిధ అంశాలపై గ్రామీణ విలేఖరులకు పునశ్చరణతరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు.
తొలి రోజు నవంబర్ 15 ఉదయం విశాఖపట్నం నుండి వెలువడే “లీడర్” దిన పత్రిక ఎడిటర్ రమణ మూర్తి “పరిశోధనాత్మక జర్నలిజం” అనే అంశం పై ప్రసంగిస్తారు. మధ్యాహ్నం తరగతుల్లో “క్రైం వార్తల్లో మెళుకువలు” అంశం పై ఆంధ్రా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ బాబీవర్ధన్ ప్రసంగిస్తారు. అనంతరం “భారత రాజ్యాంగం – పత్రికా చట్టాలు అంశం పై ఎం. శ్రీనివాస రెడ్డి ప్రసంగిస్తారు. రెండవరోజు “గిరిజన చట్టాలు – రిపోర్టింగ్ ” అంశం పై సీనియర్ జర్నలిస్టు, కాలమిస్ట్ గంజివరపు శ్రీనివాస రావు ప్రసంగిస్తారు. అనంతరం “పత్రికా భాష” అంశం పై విశాలాంధ్ర ఎడిటర్ ఆర్.వి. రామారావు ప్రసంగిస్తారు. అనంతరం కృత్రిమ మేధ” (ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్) అంశం పై సీనియర్ జర్నలిస్ట్ విజయకుమార్ కుర్రా ప్రసంగిస్తారు. సీనియర్ జర్నలిస్ట్ డి. సోమ సుందర్ “జర్నలిజం- నైతిక విలువలు ” అంశం పై ప్రసంగిస్తారు. అనంతరం ముగింపు సమావేశం,పునశ్చరణ తరగతుల్లో పాల్గొన్న జర్నలిస్టులకు సర్టిఫికెట్లు పంపిణీ చేయడం జరుగుతుంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *