అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాజధాని అమరావతిలోని శాఖమూరులో 2 ఎకరాలలో నిర్మించనున్న దసపల్లా అమరావతి హోటల్ నిర్మాణానికి మంగళవారం ఉదయం భూమి పూజ జరిగింది. “దసపల్లా అమరావతి హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్” ఆధ్వర్వంలో 400 గదులతో ఈ హోటల్ నిర్మించనున్నట్లు హోటల్ ప్రతినిధులు పేర్కొన్నారు. CII భాగస్వామ్య సదస్సు నిర్వహణ కార్యక్రమాలలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భూమి పూజలో తాడికొండ శాసనసభ్యులు తెనాలి శ్రవణ్ కుమార్, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ ఛైర్‌పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్ కాటా ఆమ్రపాలి ఐఏఎస్, గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఐఏఎస్, దసపల్లా గ్రూప్ ఛైర్మన్ మండవ రాఘవేంద్రరావు, డైరెక్టర్లు మండవ వెంకటరావు, గన్నమనేని వెంకటకృష్ణ, జాస్తి శరత్ బాబు, CRDA ఎకనామిక్ డెవలప్మెంట్ విభాగ ప్రాజెక్టు మేనేజర్ ఎం.పరంజ్యోతి రాజు, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
అమరావతిలో నిర్మించనున్న ఈ 4 స్టార్ హోటల్‌లో
* లగ్జరీ రూమ్స్ & సూట్స్
* ప్రీమియం సర్వీస్డ్ అపార్ట్‌మెంట్స్
* రెస్టారెంట్స్
* కన్వెన్షన్ సెంటర్
* కాన్ఫరెన్స్ హాల్స్
* హెల్త్ క్లబ్
* వెల్‌నెస్ సెంటర్లు
* స్విమ్మింగ్ పూల్ నిర్మించనున్నట్లు దసపల్లా గ్రూప్ వివరాలు వెల్లడించింది.
Prajavartha Online Telugu News