Breaking News

శ్రీ గౌతమీ ప్రాంతీయ గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

– నవంబర్ 14 నుండి 20 వరకు వివిధ సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం శ్రీ గౌతమీ ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం ఆధ్వర్యంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నవంబర్ 14 నుండి 20 వరకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు గ్రంథాలయాధికారి జి. శ్రీదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 14 నుంచి 20 వ తేదీ వరకు గ్రంథాలయ ప్రాంగణంలో ప్రతిరోజూ విద్యార్థులకూ, పాఠకులకూ అనేక వినూత్న కార్యక్రమాలు, పోటీలు, ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

వారోత్సవాల ప్రారంభోత్సవం నవంబర్ 14వ తేదీ శుక్రవారం ఉదయం 10.30 గంటలకు జరుగు తుందన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా స్వప్నశ్రీ కళానిలయంకు చెందిన నాట్య విశారద కొప్పినీడి స్వప్న గారి శిష్యబృందం స్వాగత నృత్య ప్రదర్శన ఇస్తారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన, దాదా నెహ్రూ చిత్రపటానికి పూలమాల ధారణ, “మీకు నచ్చిన చిత్రం” అనే అంశంపై చిత్రలేఖన పోటీలు (జూనియర్ విభాగం 1-5 తరగతుల వరకు) నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

నవంబర్ 15వ తేదీ శనివారం ఉదయం 10.30 గంటలకు పుస్తక ప్రదర్శన, నవంబర్ 16వ తేదీ ఆదివారం ఉదయం 10.00 గంటలకు విద్యార్థుల కోసం తెలుగు శతక పద్య పోటీలు, నవంబర్ 17వ తేదీ సోమవారం ఉదయం 10.30 గంటలకు శ్రీ అల్లు రామకృష్ణ ఆధ్వర్యంలో పురాతన నాణెములు, నోట్లు, పోస్టల్ స్టాంపుల ప్రదర్శన ఉంటుందన్నారు. అదే రోజున “పర్యావరణ పరిరక్షణ – మన అందరి బాధ్యత” అనే అంశంపై వ్యాస రచన పోటీలు (సీనియర్ విభాగం 6-10 తరగతుల వరకు) జరుగుతాయి.

నవంబర్ 18వ తేదీ మంగళవారం ఉదయం 10.30 గంటలకు “మనం మన గ్రంథాలయం – గ్రంథాలయాల ఆవశ్యకత” అనే అంశంపై వక్తృత్వ పోటీలు (సీనియర్ విభాగం 6-10 తరగతుల వరకు) , నవంబర్ 19వ తేదీ బుధవారం ఉదయం 10.30 గంటలకు జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు జరుగు తాయన్నారు. ఇందిరా గాంధీ చిత్రపటానికి పూల మాలధారణ అనంతరం స్థానిక మహిళా ప్రముఖులు ఇందిరా గాంధీ జీవితం, సేవలపై ప్రసంగాలు చేస్తారు.

వారోత్సవాల ముగింపు సభ నవంబర్ 20వ తేదీ గురువారం ఉదయం 10.30 గంటలకు జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రఖ్యాతులు ప్రసంగించి, విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.

విద్యార్థులు, పాఠకులు, పుస్తకాభిమానులు ఈ వారోత్సవాల కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయాలని గ్రంథాలయాధికారి జి. శ్రీదేవి పిలుపునిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈ నెల 30న పేద‌లకు ప‌ట్టాభిషేకం..

– సీఎం చేతుల మీదుగా పండ‌గ వాతావ‌ర‌ణంలో ప‌ట్టాల పంపిణీ – తొలిద‌శ‌లో 24,042 మంది ల‌బ్ధిదారుల‌కు ప‌ట్టాలు – …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *