-ఎన్డీఏ కార్యాలయంలో అందించిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్ ఎస్ బేగ్ , స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో మంజూరైన (లెటర్ ఆఫ్ క్రెడిట్) ఎల్ ఓసీ ను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్ ఎస్ బేగ్, స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు, కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో అందజేశారు. 50 వ డివిజన్, గొల్లపాలెం గట్టు ప్రాంతానికి చెందిన సరగడ గౌరీ (32) క్యాన్సర్ సోకి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. తనకి మరింత మెరుగైన వైద్యం ప్లాస్టిక్ సర్జరీ నిమిత్తం ఎన్డీఏ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 10 లక్షల ఎల్ ఓ సీ ను బాధితురాలి భర్తకి అందించారు. త్వరితగతిన ఎల్ ఓసీ ను అందజేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు బాధితురాలు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి నేతలు సరిపల్లి రాధ కృష్ణ, బూర కనకరావు, తారిఖ్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News