విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో మంజూరైన (లెటర్ ఆఫ్ క్రెడిట్ ) ఎల్ ఓసీ ను జనసేన పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ మల్లెపు విజయలక్ష్మి, టీడీపీ సీనియర్ నాయకులు మైలవరపు దుర్గారావు , కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో తో కలిసి భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో అందజేశారు. 44 వ డివిజన్, చెరువు సెంటర్ కు చెందిన పీ పుల్లేశ్వర ప్రసాద్ ( 60) బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతూ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తనకి మరింత మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు తెలపడంతో ఎన్డీఏ కార్యాలయంలో వైద్యం సాయం కొరకు దరఖాస్తు చేశారు. మంజూరైన రూ 5 లక్షల 10 వేల ఎ .ల్. ఓ .సీ ను బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. త్వరితగతిన స్పందించి ఎల్ ఓసీ ను అందజేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు బాధితుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి నేతలు , సుజనా మిత్రా కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News