-పెనుగంచిప్రోలు పీఏసీఎస్‌లో 58 లక్షల డివిడెండ్ పంపిణీ
పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త :
సహకార సంఘాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయని మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం పేర్కొన్నారు. శుక్రవారం పెనుగంచిప్రోలు పీఏసీఎస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు కర్ల వెంకటనారాయణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)తో కలిసి రూ.58 లక్షల డివిడెండ్‌ను సంఘ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా నెట్టెం రఘురాం మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా సహకార రంగాన్ని పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. పెనుగంచిప్రోలు పీఏసీఎస్ రూ.90 కోట్ల టర్నోవర్‌తో ప్రగతి పథంలో దూసుకుపోతుండటం అభినందనీయమని పేర్కొంటూ, సంఘ చైర్మన్ కర్ల వెంకటనారాయణతో పాటు సభ్యులు, సిబ్బందిని హర్షంగా అభినందించారు.
సహకార సంఘాల ద్వారా రుణాలు తీసుకున్న సభ్యులు సక్రమంగా వాయిదాలు చెల్లించి సంఘాల అభివృద్ధికి తోడ్పడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే పీఎం సూర్యఘర్ యోజన కింద అతి తక్కువ వడ్డీతో రుణాలు అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
పెనుగంచిప్రోలు లో ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటుకు ఇద్దరం కలిసి తప్పనిసరిగా కృషి చేస్తామని నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చింతల సీతారామయ్య ఎస్సీ సెల్ నాయకుడు జిల్లేపల్లి సుధీర్ సంఘ మాజీ చైర్మన్ వేగినీటి గోపాలకృష్ణమూర్తి, కొల్లా రఘురామయ్య, కేడీసీసీబీ చీఫ్ మేనేజర్ పారుపల్లి దుర్గాప్రసాద్, తెలుగు దేశం పార్టీ నాయకులు గజ్జి కృష్ణమూర్తి, చుంచు రమేష్, కొలిపాక బ్రహ్మం, ముండ్లపాటి ప్రసాద్ రావు, కాకాని శ్రీనివాసరావు, సొసైటీ సీఈవో శివరాంభట్ల కొండల శర్మతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నెట్టెం రఘురాం తాతయ్యలను సొసైటీ పాలకవర్గం ఘనంగా సన్మానించింది.
Prajavartha Online Telugu News