గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
మేడికొండూరు, గుండ్లపాలెంలలో సీసీ రోడ్లు తదితర నిర్మాణాలకుగానూ తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తో కలిసి గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ…అభిప్రాయాలకు, రాజకీయాలకు దూరంగా ఆలోచించి మంచి నాయకులను గెలిపించుకుంటే అభివృద్ధి ఎలా జరుగుతుంది అని చెప్పడానికి ఈ గ్రామమే ఒక ఉదాహరణ. ఈ రోజున బిల్లులు రాకపోయినా సొంత ఖర్చుతో గ్రామాభివృద్ధికి బాధ్యత తీసుకున్నటువంటి పాములపాటి కృష్ణయ్య వంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి, పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు మేము బాధ్యత తీసుకుంటామన్నారు. పత్తి రైతుల ఇబ్బందులను నిశితంగా పరిశీలిస్తున్నాము. రైతు సమస్యల పరిష్కారానికి కచ్చితంగా ఒక పరిష్కారాన్ని అందజేసే బాధ్యత తీసుకుంటాం. కౌలు రైతులు బాగుంటేనే వ్యవసాయం బాగుంటుంది. అన్నదాత సుఖీభవ నుంచి అందే లబ్దిని లబ్ధిదారులు కౌలు రైతులకు కూడా అందజేసేలా చొరవ తీసుకుంటే వారి జీ వన విధానానికి బాగుంటుందన్నారు. కౌలు రైతులకు న్యాయం జరిగేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కూడా ఈ విషయంపై అధికారంలోకి వచ్చిన ఫస్ట్ మీటింగ్లోనే కౌలు రైతుల గురించి చర్చించారన్నారు. కొండమోడు – పేరేచర్ల రోడ్డు నిర్మాణానికి సంబంధించిన కొన్ని ఇబ్బందులను కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తానన్నారు. గత పాలనలో రాష్ట్రం అరాచక పాలనలో నలిగిపోతున్న క్రమంలో, ప్రజలు విముక్తి కోరుకుంటున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ను ఆర్థికంగా గట్టు ఎక్కించగలను, సంపాదన సృష్టించగలను అనే నమ్మకంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలకు భరోసా ఇచ్చారన్నారు. అలాగే లోకేష్ కూడా విద్య వ్యవస్థను అభివృద్ధి పరిచే దిశగా చర్యలు చేపట్టారు. డీఎస్సీ ద్వారా 16 వేలకు పైగా టీచర్ ఉద్యోగాలు అందజేసిన లోకేష్ రెండో డిఎస్సి ప్రకటన కూడా కార్యాచరణ రూపొందిస్తున్నారన్నారు. వైసిపి హయాంలో ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి చూడలేదు. కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు- లోకేష్ ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్ కు వందలాదిస్ పరిశ్రమలు వేలాది, లక్షలాది కోట్ల పెట్టుబడులతో వస్తున్నాయన్నారు. ప్రతి గ్రామం అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ప్రజలకు విన్నవిస్తున్నానన్నారు.
ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా గుండ్ల పాలెం గ్రామ అభివృద్ధికి పెద్దపేట వేస్తుంది. ఇక్కడి ప్రజలు కూడా ఎంతో ప్రత్యేకంగా పార్టీకి కమిట్మెంట్ తో పనిచేస్తూ ఉంటారు. అలాంటి ప్రజలు వెంకట కృష్ణయ్య ని యునానిమస్ గా ఎన్నుకోవడం ఆనందించదగ్గ విషయమన్నారు. గ్రామంలో ఇంకా చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయి. వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. వైసిపి హయాంలో రౌడీయిజం, దౌర్జన్యాలు, బెదిరింపులు ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టాయన్నారు. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనీసం అలాంటి బెదిరింపులు, దౌర్జన్యాల ఊసు కూడా, ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఎక్కడా వినిపించడం లేదు, అది తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రత్యేక లక్షణమన్నారు. ఒకప్పుడు పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు జీతాలు అందక బిక్షాటన చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ చేతుల్లోకి వెళ్లాక ఉద్యోగులందరూ గర్వంగా పనిచేయగలాగుతున్నారన్నారు. నారా లోకేష్ విద్య పరంగాన్ని ఇక చాలెంజిగా తీసుకొని పనిచేస్తున్నారు. నూతన ఆవిష్కరణ తీసుకొస్తూ, విద్యా వ్యవస్థ పై గౌరవాన్ని పెంచుతున్నారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మల్లిపెద్ది రమేష్, మండల పార్టీ పెద్దలు నార్నే శ్రీనివాస్, పాములపాటి శివన్నారాయణ, గుండ్లపాలెం సర్పంచ్ పాములపాటి వెంకట కృష్ణయ్య, అబ్దుల్ ఘని, పంచాయతీరాజ్ A.E అజయ్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News