విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
25వ డివిజన్ సీతారాంపురం ఏలూరు రోడ్డు శ్రీ సత్య సాయి సేవా సమితి ట్రస్ట్ నందు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి శతవర్ష జన్మదినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు విచ్చేసి ఆ సత్య సాయి బాబా వారి ఆశీస్సులు తీసుకొని ట్రస్ట్ బోర్డ్ ఆధ్వర్యంలో పేదలకు 50 KG ల బియ్యం సంచులు, నిత్యవసర సరుకులు, కూరగాయలు అందించడం జరిగింది.
ఈ సందర్బంగా బొండా ఉమ మాట్లాడుతూ ఈరోజున ప్రత్యక్ష దైవంగా పూజింపబడే “భగవాన్ శ్రీ సత్య సాయి బాబా” 100వ జయంతి సందర్భంగా వారి సేవలు దేశం నలుమూలలా ప్రశంసింపబడుతున్నాయి అని, ఈ వేడుకలకు దేశ ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రులు మరియు ఇతర మంత్రులు సైతం పుట్టపర్తి సత్యసాయిబాబా ఆశ్రమాలను సందర్శించి ఆయనను భగవంతుని స్వరూపంగా కొలుస్తున్నారు అని అన్నారు. ఆ మహానుభావుడు “మానవ సేవే మాధవ సేవ” అనే పిలుపునిచ్చినప్పుడు, దానికి స్పందించి కొన్ని వేల కోట్ల రూపాయలు విరాళంగా వచ్చాయి అని, ఆ నిధులను సాయిబాబా ప్రజోపయోగ కార్యక్రమాల కోసం వినియోగించి, రాయలసీమకు నీటిపారుదల సౌకర్యాలు, పెద్ద విద్యా సంస్థలు, ఉచిత వైద్య సేవలు అందించే ఆసుపత్రులు వంటివి ఆయన చేపట్టిన ముఖ్య కార్యక్రమాలలో కొన్ని మాత్రమే అని… 30-40 సంవత్సరాల క్రితమే ఎవరూ ఊహించలేని విధంగా ఆయన ఉచితంగా గుండె ఆపరేషన్లు వంటి వైద్య సేవలను అందించడం ప్రారంభించారు, ఆయన పాఠశాలలు, కళాశాలల్లో విద్యనభ్యసించిన ఎంతో మంది నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు సేవ చేస్తున్నారన్నారు.
విజయవాడలోని సీతారాంపురంలో ఉన్న సత్య సాయిబాబా బృందం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అని తాను శాసనసభ్యుడిగా ఉన్నా లేకపోయినా ఈ కార్యక్రమాలకు హాజరవుతూ ఉంన్నాను, అలాగే ప్రతి నెలా బాబా పేరు మీద ఎంతో మంది పేదలకి నిత్యావసర వస్తువులు అందించి, అన్ని రకాలుగా ఆదుకుంటూ ఉంటున్నారన్నారు. గత సంవత్సరం విజయవాడ లో బుడమేరు వరదలు వచ్చినప్పుడు, దాదాపు ₹1 కోటి రూపాయల విలువైన నిత్యావసర సరుకులు మరియు వస్త్రాలను సత్యసాయి భక్తులు పుట్టపర్తి నుంచీ, ఇతర ప్రాంతాల నుంచీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని వరద బాధితులకు అందజేశారు అని, ఇది పుట్టపర్తి సాయిబాబా పేరు మీద నిత్యం జరిగే సేవా కార్యక్రమాలకు ఒక నిదర్శనం అని, ఒక శాసనసభ్యుడిగా, స్వామి వారి భక్తుడిగా ఈ సేవల్లో పాలుపంచుకోవడం నాకు ఆనందంగా ఉంది అని తెలియజేసారు.
Prajavartha Online Telugu News