Breaking News

శ్రీ సత్యసాయిబాబా శతజయంతి వేడుకల్లో కలెక్టర్ లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆదివారం విజయవాడ, సీతారాంపురంలోని శ్రీ సత్యసాయి మందిరంలో జరిగిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శతజయంతి వేడుకల్లో కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి చిత్రపటానికి పూల మాలలు అలంకరించి, భగవాన్ మానవాళి శ్రేయస్సుకు చేసిన సేవలను స్మరించుకున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తులకు స్వయంగా కలెక్టర్ లక్ష్మీశ ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ ఎన్వీఎల్ నరసింహారావు. శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *