Breaking News

ఇందిరా గాంధీ మున్సిప‌ల్ స్టేడియం అభివృద్దిపై స‌మీక్షా స‌మావేశం

-న‌మూనా చిత్రాలు ప‌రిశీలించిన ఎంపీ కేశినేని శివ‌నాథ్, శాప్ చైర్మ‌న్ అనిమిని ర‌వి నాయుడు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇందిరాగాంధీ స్టేడియం అభివృద్ది, పునరుద్ధరణ ప‌నుల‌పై సోమ‌వారం ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలోని శాప్ కార్యాలయంలో స‌మీక్షా స‌మావేశం జ‌రిగింది. శాప్ చైర్మ‌న్ అనిమిని రవినాయుడు ఆధ్వ‌ర్యంలో జరిగిన ఈ స‌మావేశంలో ఎంపీ కేశినేని శివ‌నాథ్, శాప్ ఎమ్.డి భరణి తో పాటు శాప్ , డైరెక్టర్లు, అధికారులు, ఆర్కిటెక్చర్లు పాల్గొన్నారు.

నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య మున్సిపల్ ఇండోర్ స్టేడియం, బందర్ రోడ్ లోని దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియం, పశ్చిమ నియోజకవర్గం విద్యాధర పురం మున్సిపల్ క్రీడా ప్రాంగణాలను పూర్తిగా ప‌రిశీలించిన‌ట్లు ఆర్కిటెక్చ‌ర్లు తెలిపారు. అలాగే ఇందిరా గాంధీ మున్సిప‌ల్ స్టేడియం పునరుద్ధరణకు సంబంధించిన న‌మూనా చిత్రాల‌ను ప్ర‌దర్శించి వివ‌రాలు తెలియ‌జేశారు. ఎంపీ కేశినేని శివ‌నాథ్, శాప్ చైర్మ‌న్ అనిమిని ర‌వి నాయుడు దానికి సంబంధించి ప‌లు స‌ల‌హాలు, సూచ‌న‌లు చేయ‌టంతో పాటు కొన్ని మార్పులు చేయాల్సిందిగా సూచించారు. ఇందిరా గాంధీ స్టేడియానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆధునిక సదుపాయాల ఏర్పాటు, క్రీడాకారులకు అవసరమైన వసతుల విస్తరణ, స్థానిక క్రీడా కార్యకలాపాల ప్రోత్సాహం వంటి అంశాలపై ప్రత్యేకంగా చర్చించారు.

ఈ స‌మావేశంలో న‌గ‌రంలోని స్టేడియాల‌ను అభివృద్ధి చేసేందుకు ప‌నులు యుద్ద‌ప్రాతిప‌దిక‌న చేప‌ట్టాల‌ని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. అలాగే ఈ స్టేడియాల అభివృద్దికి సంబంధించిన‌ స‌మ‌గ్ర నివేదిక‌లు త్వ‌రిత‌గ‌తిన‌ స‌మ‌ర్పించాల‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో శాప్ డైరెక్ట‌ర్ సంతోష్ కుమార్, అడ్మిస్ట్రేటివ్ ఆఫీసర్ రమావత్ నాయక్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మునిశేఖర్, డి.ఎస్.డి.వో కాకర్ల కోటేశ్వరరావు, ఆర్కిటెక్చర్లు వడ్లమూడి శ్రీ హర్ష, రామ్ కిరణ్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *