Breaking News

విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ప్రభుత్వం బాటలు

-విద్యార్థుల భవిష్యత్తును బలోపేతం చేసేందుకే విలువల విద్యా సదస్సు
-విలువలతో విద్యను సమన్వయం చేస్తూ మంత్రి నారా లోకేష్ ముంద‌డుగు
-మంత్రి నారా లోకేష్‌, రాష్ట్ర ప్ర‌భుత్వ నైతిక విలువ‌ల స‌ల‌హాదారులు బ్ర‌హ్మ‌శీ చాగంటి కోటేశ్వ‌ర‌రావు కి స్వాగ‌తం ప‌లికిన ఎంపీ కేశినేని శివనాథ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్య తో పాటు, నైతిక విలువలు విద్యార్ధుల‌లో పెంపొందించి వారి బంగారు భ‌విష్య‌త్తు కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం బాటలు వేస్తుంద‌ని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ అన్నారు. రాష్ట్ర విద్యా శాఖ ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం తుమ్మ‌ల‌ప‌ల్లి క‌ళాక్షేత్రం లో ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్ర‌భుత్వ నైతిక విలువ‌ల స‌ల‌హాదారులు బ్ర‌హ్మ‌శీ చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌వ‌చ‌న కార్య‌క్ర‌మం విలువ‌ల విద్యా స‌ద‌స్సు-2025 కార్య‌క్ర‌మంలో ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు.

రాష్ట్ర విద్య‌,ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్‌, రాష్ట్ర ప్ర‌భుత్వ నైతిక విలువ‌ల స‌ల‌హాదారులు బ్ర‌హ్మ‌శీ చాగంటి కోటేశ్వ‌ర‌రావు ల‌కు ఎంపీ కేశినేని శివ‌నాథ్,ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు, క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశాల‌ తో పాటు ఇత‌ర ప్ర‌భుత్వాధికారులు స్వాగ‌తం ప‌లికారు.

విద్యార్థుల్లో నైతికత, ధార్మికత, మానవీయ విలువలను పెంపొందించాల్సిన అవసరం పై చాగంటి కోటేశ్వరరావు చేసిన ప్ర‌వ‌చ‌నం విద్యార్దుల్లో నైతిక విలువ‌లు పెర‌గ‌టానికి ఎంతో దోహ‌ద‌ప‌డింద‌ని ఎంపీ కేశినేని శివ‌నాథ్ అభిప్రాయ ప‌డ్డారు. చాగంటి లోతైన ఆలోచనలు, సదాచార పాఠాలు యువతలో నైతికతను పెంపొందించేందుకు మార్గదర్శకంగా నిలిచాయన్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నాయ‌క‌త్వంలో , విద్యా, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్ ఆధ్వ‌ర్యంలో విద్యార్థుల మనోభావాలను పునర్నిర్మించడంలో ప్ర‌భుత్వం ఎంతో బాధ్యతగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్నారు. విద్యార్ధుల‌కుపాఠ్య పుస్తకాలతో పాటు మనసును తీర్చిదిద్దే సద్గుణాలు నేర్పించాలనే ఉద్దేశ్యంతో ఈ సదస్సు ఏర్పాటు చేసిన మంత్రి నారా లోకేష్ కి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. సమాజ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర ఎంతో ముఖ్యమని, వారికి సత్సంకల్పాలు, సన్మార్గం చూపే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, నాయకులు మరింత బాధ్యతతో ముందుకు రావాలని త‌న ప్ర‌వ‌చ‌నంతో తెలియ‌జెప్పిన రాష్ట్ర ప్ర‌భుత్వ నైతిక విలువ‌ల స‌ల‌హాదారులు బ్ర‌హ్మ‌శీ చాగంటి కోటేశ్వ‌ర‌రావు కి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో స్వ‌చ్చాంధ్ర కార్పొరేష‌న్ చైర్మ‌న్ కొమ్మారెడ్డి ప‌ట్ట‌భిరామ్, గొట్టుముక్కల రఘురామరాజు ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్స్ & కన్‌స్ట్రక్షన్స్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్క‌ల ర‌ఘురామ‌రాజు, విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు, సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరక్టర్ బి.శ్రీనివాసరావు ల‌తోపాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గణనాధుడిని సందర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి దేవినేని ఉమా

కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా సెంట్రల్ బ్యాంక్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *