Breaking News

ఉర్దూ అకాడ‌మీ ఛైర్మ‌న్ ఫ‌రూక్ షిబ్లీకి ఎంపీ కేశినేని శివ‌నాథ్ అభినంద‌న‌

-ఎంపీ కేశినేని శివ‌నాథ్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన ఉర్దూ అకాడ‌మీ ఛైర్మ‌న్ ఫ‌రూక్ షిబ్లీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలోని మొగ‌ల్రాజ్ పురానికి చెందిన మైనార్టీ హ‌క్కుల ప‌రిరక్ష‌ణ అధ్యక్షుడు, రాష్ట్ర ఉర్దూ అకాడ‌మీ కార్పొరేష‌న్ చైర్మ‌న్ గా నియ‌మితులైన ఫ‌రూక్ షిబ్లీ ను ఎంపీ కేశినేని శివనాథ్ అభినందించారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో ఎంపీ కేశినేని శివనాథ్ ను కొండ‌ప‌ల్లి ద‌ర్గా బాబా ఫ‌క్రుద్దీన్ తో కలిసి ఉర్దూ అకాడ‌మీ ఛైర్మ‌న్ ఫ‌రూక్ షిబ్లీ సోమ‌వారం మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఫ‌రూక్ షిబ్లీ ను ఎంపీ కేశినేని శివనాథ్ శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. మైనార్టీ స‌మ‌జాం సంక్షేమం కోసం మైనార్టీ హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ స‌మితి స్థాపించి ఎన్నో సేవ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌టంతో పాటు, వైసిపి హ‌యంలో ముస్లింల‌పై జ‌రిగిన దాడులకు, ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేశార‌ని ఎంపీ కేశినేని శివ‌నాథ్ గుర్తు చేశారు. ఫ‌రూక్ షిబ్లీ ఉర్దూ అకాడ‌మీ చైర్మ‌న్ ప‌ద‌వి రావ‌టం ఎంతో ఆనందంగా వుంద‌న్నారు. ఉర్దూ భాషాభివృద్దికి మ‌రింత కృషి చేయాల‌ని ఫ‌రూక్ షిబ్లీ ని ఎంపీ కేశినేని శివ‌నాథ్ కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో మైనార్టీ నాయ‌కులతో పాటు యువ‌కులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

​రాజమండ్రిలో ముగిసిన పోషణ్ మాహ్ ప్రదర్శన : ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు హాజరు

​రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *