విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మెప్మా రూపొందించిన మెప్మా వార్షిక సంచిక ‘అవని ‘ ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సోమవారం తన కార్యాలయం ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ‘ అవని’ సంచికలో స్పూర్తి గొలిపే గాథలు ప్రచురించడమే కాకుండా వివిధ జిల్లాల్లో మహిళా సంఘాలు సాధించిన విజయ గాథలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో మహిళ పారిశ్రామిక విప్లవానికి గట్టి పునాదులు పడుతున్నాయన్నారు. ఒక కుటుంబానికి ఒక వ్యాపారవేత్త తయారుచేయాలనే ముఖ్యమంత్రి సంకల్పం. రాష్ట్రంలో మహిళ శక్తిని. మహోన్నత శక్తిగా మార్చే ప్రక్రియకు నాంది పలికిందన్నారు. ఈ క్రమంలో ఒక్కో అడుగు వినూత్నంగా వేయడం జరుగుతుందని, మెప్మా మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ… వారికి సరికొత్త అవకాశాలను చూపిస్తూ.. ముందుకు సాగుతుందని తెలిపారు. మెప్మా చేపట్టిన 9 ప్రాజెక్టులకు ఇటీవల వచ్చిన స్కోచ్ అవార్డులు మెప్మాను దేశంలోనే అగ్రగామిగా నిలిపాయన్నారు. ఇందులో జిల్లాలోని ప్రతి మహిళా సంఘం వినూత్న రీతిలో కార్యకలాపాలు చేపడుతూ రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వి.ఎం.సి ప్రాజెక్ట్ ఆఫిసర్ వెంకట నారాయణ, ఎన్టీఆర్ జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.మురళీ కృష్ణ ప్రసాద్, డి.ఆర్.డి. ప్రాజెక్ట్ డైరెక్టర్ నాంచారరావ్, టిడిపి సీనియర్ నాయకులు నరసింహా చౌదరి, ఎన్టీఆర్ జిల్లా అర్బన్ మహిళ సమైక్య అధ్యక్షురాలు కె. మీనాక్షి , ఎన్టీఆర్ జిల్లా రూరల్ మహిళా సమైక్య అధ్యక్షురాలు కల్పన లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News