Breaking News

పిజిఆర్ఎస్, డయల్ యువర్ కమిషనర్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ ప్రతి సోమవారం జరిగే పిజిఆర్ఎస్, డయల్ యువర్ కమిషనర్ కి ప్రజల నుండి అందే ఫిర్యాదులు, అర్జీలను క్షేత్ర స్థాయిలో విభాగాదిపతులే పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు విభాగాధిపతులకు స్పష్టం చేశారు. సోమవారం డయల్ యువర్ కమిషనర్, నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో పిజిఆర్ఎస్ జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత డయల్ యువర్ కమిషనర్ ద్వారా ప్రజల నుండి అందిన 26 ఫిర్యాదులు తీసుకొని, అధికారులతో మాట్లాడుతూ ప్రజల నుండి అందే అర్జీల్లో తక్షణం పరష్కారం చేయగలిగినవి, కొంత సమయం తర్వాత చేయగలిగినవి వేరువేరుగా లిస్టు తయారు చేయాలన్నారు. డయల్ యువర్ కమిషనర్ కి అందిన ఆర్జీల పరిష్కారానికి విభాగాధిపతులే క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లాలన్నారు. అర్జీల పరిష్కార పురోగతిపై కమిషనర్ చాంబర్ కు ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
అనంతరం కౌన్సిల్ సమావేశ మందిరంలో పిజిఆర్ఎస్ కార్యక్రమం ద్వారా మేయర్ తో కలిసి ప్రజల నుండి అర్జీలు తీసుకొన్న కమిషనర్ అధికారులతో మాట్లాడుతూ పిజిఆర్ఎస్, ఇతర వేదికల ద్వారా ప్రజలు ఇస్తున్న అర్జీలను సమగ్రంగా పరిష్కారం చేయాలన్నారు. సోమవారం జరిగే కార్యక్రమానికి క్షేత్ర స్థాయి అధికారులు కూడా హాజరైతే సమస్యల పరిష్కారం తేలికవుతుందని పేర్కొన్నారు. అర్జీలు బియండ్ ఎస్ఎల్ఏ లోకి వెళ్లడానికి వీలులేదన్నారు. క్షేత్ర స్థాయి అధికారులు ఆర్జీలను నేరుగా వెళ్లి పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పరిష్కారం అనంతరం ఫిర్యాదికి సమాచారం తెలియచేయాలన్నారు.
పిజిఆర్ఎస్ ద్వారా 33 అర్జీలు అందాయని, వాటిలో పట్టణ ప్రణాళిక విభాగం 13, ఇంజినీరింగ్ విభాగం 9, రెవెన్యూ విభాగం 3, ప్రజారోగ్య విభాగం 7 ఉపా సెల్ విభాగానికి సంబందించి 1 ఫిర్యాదు అందాయన్నారు.
కార్యక్రమంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు సిహెచ్.శ్రీనివాస్, బి.శ్రీనివాసరావు, సిటి ప్లానర్ రాంబాబు, ఎస్ఈ(ఇంచార్జి) సుందర్రామిరెడ్డి, సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, మేనేజర్ బాలాజీ బాష పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *