గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అన్నక్యాంటీన్ల వద్ద మౌలిక వసతుల కల్పనలో జిఎంసి ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. సోమవారం ఆర్టీఓ కార్యాలయం దగ్గరలోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అన్న క్యాంటీన్లలో ఆహారం తీసుకునేవారికి ఏ ఇబ్బంది లేకుండా లైటింగ్, ఫ్యాన్ల ఏర్పాటు, ఎక్కడైనా మరమత్తులు ఉంటే వెంటనే చేపట్టాలన్నారు. పరిసరాల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధ్యాన్యత ఇవ్వాలన్నారు. ఈగలు, ఇతర క్రిమి కీటాకాలు రాకుండా డిస్ ఇన్ఫెక్షన్ చర్యలను మలేరియా సిబ్బంది చేపట్టాలన్నారు. అలాగే ఆహార సరఫరా అనంతరం ప్రాంగణం శుభ్రం చేయాలని అక్షయపాత్ర సిబ్బందిని ఆదేశించారు. ప్రతి రోజు ప్రభుత్వ నిర్దేశిత సమయంలో ఆహారం అందుబాటులో ఉండేలా, సమయ పట్టిక కనిపించేలా బోర్డ్ లను ఏర్పాటు చేయాలన్నారు.
Prajavartha Online Telugu News