Breaking News

మ‌హిళా సాధికార‌త‌కు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు

– వినూత్న చొర‌వ‌, ప‌థ‌కాల‌తో ప్ర‌భుత్వ చేయూత‌
– గ్రామ‌స్థాయి నుంచి అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించండి
– వ‌న్ స్టాప్ సెంట‌ర్, ఉమెన్ హెల్ప్ లైన్ (181) సేవ‌ల‌పై దాహాన్ని కల్పించండి
– ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆప‌ద‌లో ఉన్న మ‌హిళ‌ల‌కు ఆప‌న్న హ‌స్తం అందించి స‌మాజంలో ఎదిగేలా చేసేందుకు, మ‌హిళ‌ల సాధికార‌త ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం వినూత్న కార్య‌క్ర‌మాలు, ప‌థ‌కాలు అమ‌లుచేస్తోంద‌ని, వీటిని స‌ద్వినియోగం చేసుకునేలా గ్రామ‌స్థాయి నుంచి అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు.
క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధ్య‌క్ష‌త‌న మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో మిష‌న్ శ‌క్తి జిల్లాస్థాయి క‌మిటీ స‌మావేశంతో పాటు వ‌ర‌క‌ట్న నిషేధ చ‌ట్టం – 1961 అమ‌లుపై స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. మ‌హిళా, శిశు సంక్షేమం; వైద్య ఆరోగ్యం, పోలీస్, విద్య త‌దిత‌ర స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు హాజ‌రైన ఈ స‌మావేశంలో బేటీ బ‌చావో బేటీ ప‌ఢావో, వ‌న్ స్టాప్ సెంట‌ర్, నారీ అదాల‌త్‌, ఉమెన్ హెల్ప్ లైన్ (181), ప్ర‌ధాన‌మంత్రి మాతృ వంద‌న యోజ‌న‌, శ‌క్తి స‌ద‌న్‌, శ‌క్తి నివాస్ త‌దిత‌రాల అమ‌లుపై స‌మీక్షించి.. మ‌రింత స‌మ‌ర్థ‌వంత అమ‌లుకు సూచ‌న‌లు చేశారు. భ‌ర్త‌ను కోల్పోయిన, బంధువులతో నిరాద‌ర‌ణ‌కు గురైన స్త్రీలు, లైంగిక వేధింపుల‌కు గురైన స్త్రీలు వంటివారికి ఆప‌న్న హ‌స్తం అందించి, స‌మాజంలో ఉన్న‌తంగా ఎదిగేందుకు చేయూత‌నిచ్చేందుకు ఉన్న కార్య‌క్ర‌మాల‌ను ప‌టిష్టంగా అమ‌లుచేయాల‌ని సూచించారు. శ‌క్తి స‌ద‌న్‌ల ద్వారా అందుతున్న ఉచిత వ‌స‌తి, ఆహారం, వైద్య స‌దుపాయాలు, వృత్తి, నైపుణ్య శిక్ష‌ణ‌, న్యాయ‌ప‌ర‌మైన స‌ల‌హాలు, సామాజిక ఆర్థిక భ‌ద్ర‌త, సోష‌ల్ కౌన్సెలింగ్ త‌దిత‌రాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు. ఇందుకు వాస‌వ్య మ‌హిళా మండ‌లి, గ్రామ వికాస్ వంటి స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌తో క‌లిసి అవ‌గాహ‌న శిబిరాలు నిర్వ‌హించాల‌న్నారు. ప్ర‌తి సోమ‌వారం జ‌రిగే ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) కార్య‌క్ర‌మానికి వ‌న్‌స్టాప్ సెంట‌ర్ ప్ర‌తినిధులు అందుబాటులో ఉండాల‌న్నారు. ఆప‌ద‌లో ఉన్న మ‌హిళ‌ల‌కు మేమున్నామంటూ స‌మ‌ష్టిగా భ‌రోసా క‌ల్పించాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని స్ప‌ష్టం చేశారు.
స‌మావేశంలో వ‌ర‌క‌ట్న నిషేధ చ‌ట్టం-1961 అమ‌లుపైనా చ‌ర్చించారు. చ‌ట్ట ప‌టిష్ట అమ‌లుకు స‌మ‌న్వ‌య శాఖ‌లు కృషిచేస్తూ చ‌ట్ట స్ఫూర్తిపై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు.
స‌మావేశంలో ఐసీడీఎస్ పీడీ రుక్సానా సుల్తానా బేగం, డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, జి.రేష్మి (వాస‌వ్య మ‌హిళా మండ‌లి), వీడీ స‌త్య‌నారాయ‌ణ‌రెడ్డి (గ్రామ వికాస్‌), డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచార‌రావు, స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు, వివిధ స్వ‌చ్ఛంద సంస్థ‌ల ప్ర‌తినిధులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *