Breaking News

వసతి గృహ విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, కెరీర్ గైడెన్స్‌పై అవగాహన సదస్సు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆదివారం వై జంక్షన్ సమీపంలో ఉన్న కల కళాశాల బాలుర వసతి గృహంలో, రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో సమతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాసం, సత్ప్రవర్తన, కెరీర్ గైడెన్స్ తదితర అంశాలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఐఆర్‌ఎస్ అధికారి, రిటైర్డ్ ఆదాయపన్ను శాఖ అధికారి ఎమ్. తిరుమల కుమార్ మాట్లాడుతూ, సమాజంలో అట్టడుగు వర్గాల నుంచి ఎదిగి ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ లక్ష్యసాధనకు కృషి చేయాలని, పోటీ పరీక్షలను ఎదుర్కొనే విధానంపై అనేక ప్రాయోగిక సూచనలు, సలహాలు అందించారు.

ఈ అవగాహనా సదస్సులో ఏబీసీడబ్ల్యూడబ్ల్యూ ముత్యాల సుబ్బారావు, హెచ్‌డబ్ల్యూడబ్ల్యూ అబ్దుల్ సుకూర్, పి. గంగాధర్, లెక్చరర్ మదీనా, ఎల్‌ఐసి ఏవో రామ్ కుమార్, డెవలప్‌మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వసతి గృహ విద్యార్థులు పాల్గొని సదస్సును విజయవంతం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంద్రకీలాద్రిపై భక్తులకు సరికొత్త సేవలు- రాష్ట్రంలోనే తొలిసారిగా ‘లడ్డూ ప్రసాదం ఏటీఎం’ ప్రారంభం

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం (ఇంద్రకీలాద్రి) కొండ దిగువన, అర్జునవీధి ప్రారంభంలోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *